Pink Ball: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు

By telugu teamFirst Published Nov 22, 2019, 11:40 AM IST
Highlights

భారత్, బాంగ్లాదేశ్ ల మధ్య తొలి పింక్ బాల్ డే నైట్ టెస్ట్ మ్యాచ్ నేడు ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పింక్ బాల్ సమరంపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. 

భారత్ తన తొలి పింక్ బాల్ టెస్టు ఆడుతున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఈ డే నైట్ పింక్ బాల్ టెస్ట్ మ్యాచుల గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు.  

గులాబీ టెస్టు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నానాని అన్నాడు. ఇది తమకొక సరికొత్త సవాల్‌ అని కోహ్లీ పేర్కొన్నాడు. తొలి మూడు రోజులు టికెట్లు పూర్తిగా అమ్ముడయిపోయాయి కాబట్టి పూర్తిగా నిండిన మైదానంలో టెస్టు ఆడటం గొప్ప అనుభూతి కానుందని అన్నాడు. 

Also read: నేటి నుంచే చారిత్రాత్మక డే నైట్ టెస్టు మ్యాచ్: గులాబీ సమరానికి సై...

అడపాదడపా గులాబీ టెస్టుకు తాను సుముఖమేననీ, కాకపోతే, రెగ్యులర్‌గా డే నైట్‌ టెస్టులకు తాను పూర్తి వ్యతిరేకమని అన్నాడు. వినోదం కోణంలో టెస్టు క్రికెట్‌ను చూడలేమని అంటూ టెస్టు క్రికెట్లో ఉండే అసలైన మజాను వివరించాడు. 

సెషన్ల పాటు వికెట్లు కాపాడుకునే బ్యాట్స్‌మన్‌ పోరాటం, వికెట్‌ వేటలో బౌలర్ల దాడిని చూసి ఆస్వాదించే అభిమానులు ఉంటే చాలని, ఇదే నిజమైన టెస్ట్ క్రికెట్ ఎంజాయిమెంట్ అని అన్నాడు.  

ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం సంప్రదాయ ఫార్మాట్‌ను వదిలేసి, గులాబీ బంతికి మారిపోవడానికి వ్యక్తిగతంగా తాను వ్యతిరేకం అని చెప్పుకొచ్చాడు.  భారత దిగ్గజం రాహుల్‌ ద్రవిడ్‌ సూచించినట్టు భారత్‌కు ఒక ఖచ్చితమైన టెస్టు క్రికెట్‌ షెడ్యూల్‌ అవసరమని పేర్కొన్నాడు.  

ఎప్పుడు, ఎక్కడ ఏ సమరమో తెలిసినప్పుడు సన్నద్ధత సులభం అవుతుందిని అన్నాడు.  అంతేకాకుండా ఏ టీం తోని అని తెలియడంవల్ల ఆ టీం కోసం ప్రత్యేకమైన వ్యూహాలు రచించడం, బెంచ్ స్ట్రెంగ్త్ ను కూడా బలపరుచుకోవచ్చని అభిప్రాయపడ్డాడు. అభిమానులను మైదానానికి రప్పించడానికి సైతం నిర్దిష్టమైన షెడ్యూల్ దోహదం చేస్తుందిని విరాట్ అభిప్రాయపడ్డాడు.

భారత టెస్టు క్రికెట్‌ చరిత్రలో మరో మైలురాయిని అందుకోబోతుంది. ఐదు రోజుల ఆటలో టీమ్‌ ఇండియా తొలిసారి ఫ్లడ్‌లైట్ల వెలుతురులో  పింక్ బాల్ టెస్టు సమరానికి సిద్ధమవుతోంది. శుక్రవారం నుంచి ఆరంభం కానున్న గులాబీ టెస్టు భారత్‌, బంగ్లాదేశ్‌లకు తొలి డే నైట్‌ మ్యాచ్‌ కావటం విశేషం. 

మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే వ్యక్తిగత చొరవ చూపిన అంశం డే నైట్‌ టెస్టు. దాదా ఆలోచనకు కెప్టెన్‌ కోహ్లి అంగీకారం వెంటనే లభించింది. ఆదరణ కోల్పోతున్న టెస్టు క్రికెట్‌కు సరికొత్త జీవం తీసుకొచ్చేందుకు డే నైట్‌ గులాబీ టెస్టు చక్కటి మార్గమని గంగూలీ గట్టిగా నమ్ముతున్నాడు. 

ప్రపంచ క్రికెట్‌కు డే నైట్‌ టెస్టు కొత్త కాదు, కానీ భారత అభిమానులకు గులాబీ పోరు న్యూ ఫార్మాట్‌!.  అభిమానులను మైదానంలోకి రప్పించేందుకు గులాబీ టెస్టు బ్రహ్మాస్త్రం అని చాలామంది క్రికెట్ అభిమానులు బలంగా నమ్ముతున్నారు. 

click me!