ప్రాక్టీస్ మ్యాచ్ ఉంటే బాగుండేది... పింక్ బంతితో టెస్టు మ్యాచ్ పై బంగ్లా కెప్టెన్

By telugu teamFirst Published Nov 22, 2019, 9:31 AM IST
Highlights

తమ జట్టులో పింక్ బాల్ ప్రతి ఒక్కరికీ కొత్తేనని ఆయన అన్నారు. అయితే.. తమకు నెట్ ప్రాక్టీస్ లాభించిందని చెప్పాడు. ఆ అనుభవాన్ని ఉపయోగించుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. తొలి పింక్ బాల్ మ్యాచ్ ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామన్నాడు.

టీమిండియాతో టెస్టు మ్యాచ్ కోసం బంగ్లా జట్టు సిద్ధమౌతోంది. ఈ టెస్ట్ మ్యాచ్ పింక్ బంతితో డే అండ్ నైట్ జరగనున్న సంగతి తెలిసిందే. కాగా... ఈ టెస్టు సిరీస్ పై బంగ్లా జట్టు కెప్టెన్ మొమినల్ హఖ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇలాంటి సిరీస్ కి ముందు కనీసం ప్రాక్టీస్ మ్యాచ్ ఉంటే బాగుండేదని అభిప్రయపడ్డారు.

ప్రాక్టీస్ మ్యాచ్ ఆడే అవకాశం కూడా దొరకలేదని ఆయన అన్నారు. బోర్డు పింక్ బాల్ పై నిర్ణయం తీసుకుంటున్న సమయంలో తాము ఏమీ చేయలేకపోయామన్నారు. మానసికంగా సిద్ధమవ్వడమే తమ ముందు ఉన్న ఏకైక మార్గమని అతను చెప్పాడు. పింక్ బాల్ తో గేమ్ ఆడాలంటే ముందు ప్రాక్టీస్ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

తమ జట్టులో పింక్ బాల్ ప్రతి ఒక్కరికీ కొత్తేనని ఆయన అన్నారు. అయితే.. తమకు నెట్ ప్రాక్టీస్ లాభించిందని చెప్పాడు. ఆ అనుభవాన్ని ఉపయోగించుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. తొలి పింక్ బాల్ మ్యాచ్ ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామన్నాడు.

2013లో బంగ్లాదేశ్ దేశవాళీ మ్యాచ్ లో గులాబీ బంతితో ఆడింది. అందులో ప్రస్తుత ఆటగాళ్లెవరూ లేకపోవడం గమనార్హం. కాగా... తొలి టెస్టులో సెషన్ల వారీగా ఆడాలని తాము ప్రణాళిక వేసుకున్నట్లు చెప్పారు. గతం నుంచి తాము చాలా నేర్చుకున్నామని చెప్పాడు. తొలి ఇన్నింగ్స్ లో తాము కొన్ని పొరపాట్లు చేశామని అంగీకరించాడు. టాప్ ఆర్డర్ లో భాగస్వామ్యాలు లేవని చెప్పాడు. మెరుగైన షాట్లు ఆడలేకపోయామని తెలిపాడు. బంగ్లా ప్రధాని షేక్ హసీనా మ్యాచ్ కి రావడం వల్ల తమకు ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పాడు. 

click me!