మేం ఇలా చేస్తాం: బీసీసీఐకి పీసీబీ బెదిరింపులు

By telugu teamFirst Published Jan 26, 2020, 9:39 AM IST
Highlights

తమ దేశంలో భారత క్రికెట్ జట్టు ఆసియా కప్ ఆడకపోతే తాము భారత్ లో జరిగే తదుపరి టీ20 ప్రపంచ కప్ టోర్నీని బహిష్కరిస్తామని పీసీబీ బీసీసీఐని హెచ్చరించింది. ఆసియా కప్ టోర్నీ  ఈ సెప్టెంబర్ లో జరగనుంది.

ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) బెదిరింపులకు దిగింది.  సెప్టెంబర్ లో తాము ఆతిథ్యమించ్చే టీ20 ఆసియా కప్ టోర్నీలో భారత్ పాల్గొనాలని హెచ్చరించింది. లేదంటే 2021లో భారత్ లో నిర్వహించే టీ20 ప్రపంచ కప్ టోర్నీకి తమ జట్టును పంపించబోమని తేల్చి చెప్పింది. 

ఆసియా కప్ కోసం భారత్ తమ దేశానికి రాకపోతే తాము అక్కడ జరిగే 2021 టీ20 ప్రపంచ కప్ టోర్నీకి దూరంగా ఉంటామని పీసీబీ సీఈవో వసీమ్ ఖాన్ చెప్పారు బంగ్లాదేశ్ పాకిస్తాన్ లో పర్యటిస్తే ఆసియా కప్ ఆతిథ్య హక్కులను బదిలీ చేస్తారని వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. 

Also Read: టీ20ల్లో పాక్ జోరు.. నెంబర్ వన్ స్థానం కైవసం!

ఆసియా క్రికెట్ మండలి మతకు ఆతిథ్య హక్కులు ఇచ్చిందని, వాటిని తాము ఎవరికీ ఇవ్వబోమని, ఆ అధికారం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. 2023 - 2031 మధ్య కనీసం మూడు ఐసీసీ టోర్నీల ఆతిథ్య హక్కులు పొందడానికి ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు .

భారత్, పాకిస్తాన్ జట్లు ద్వైపాక్షిక సిరీస్ ఆడక చాలా కాలం అవుతోంది. ఉగ్రవాదాన్ని నిర్మూలించేంత వరకు పాకిస్తాన్ లో తమ ఆటగాళ్లు క్రికెట్ ఆడడానికి అనుమతించబోమని భారత ప్రభుత్వం చెబుతోంది. అందుకే ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఇరు దేశాలు తలపడుతున్నాయి. 

click me!