టీమిండియాకు వికెట్ కీపింగ్ చేయడాన్ని నిజంగా ప్రేమిస్తున్నానని, దాన్ని ఆస్వాదిస్తున్నానని క్రికెటర్ కేఎల్ రాహుల్ అన్నాడు. న్యూజిలాండ్ పై తొలి టీ20 విజయం సాధించన తర్వాత అతను ఆ మాటన్నాడు.
ఆక్లాండ్: వికెట్ కీపింగ్ ను నిజాయితీగా ప్రేమిస్తున్నానని టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ అన్నాడు. గాయం కారణంగా రిషబ్ పంత్ దూరమైన స్థితిలో వికెట్ కీపింగ్ బాధ్యతల్లోకి వచ్చిన ఆయన న్యూజిలాండ్ పై టీ20 సిరీస్ లోను వికెట్ కీపింగ్ చేస్తున్నాడు.
ఐపిఎల్ లో మూడు నాలుగేళ్లుగా వికెట్ కీపింగ్ చేస్తున్నానని, అంతర్జాతీయ స్థాయిలో తనకిది కొత్త అని రాహుల్ అన్నాడు. దొరికినప్పుడు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోనూ వికెట్ కీపింగ్ చేశానని చెప్పాడు. వికెట్ల వెనకాల ఉండడాన్ని ఆస్వాదిస్తున్నానని చెప్పాడు.
undefined
Also Read: మ్యాచ్ రివ్యూ: వరల్డ్ కప్ ముంగిట ఎన్నెన్నో ప్రశ్నలు... అన్నింటికి లభించిన సమాధానాలు
వికెట్ కీపింగ్ బాధ్యతను ఆనందిస్తున్నానని, దానివల్ల పిచ్ ఎలా స్పందిస్తుందో తనకు అవగాహనకు వస్తోందని, ఫీల్డింగ్ లో మార్పులు చేసుకునేందుకు కెప్టెన్ కు ఆ సమాచారం చేరవేస్తున్నానని రాహుల్ చెప్పాడు.
చురుగ్గా కదలడం, ఏ లెంగ్త్ లు సరైనవో చెప్పడం తన బాధ్యత అని చెప్పాడు. 20 ఓవర్లు కీపింగ్ చేసిన తర్వాత బ్యాట్స్ మన్ గా ఏ విధమైన షాట్లు బాగుంటాయో అర్థమవుతోందని ఆయన అన్నాడు. మంచి చేస్తున్నంత వరకు తనకు ఈ అదనపు బాధ్యతలను ఆస్వాదిస్తున్నట్లు తెలిపాడు.
Also Read: అలా చెప్పలేదు, అద్భుతం: న్యూజిలాండ్ పై విజయంపై కోహ్లీ
న్యూజిలాండ్ మీద జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో 56 పరుగులు చేసిన తర్వాత రాహుల్ తన వికెట్ కీపింగ్ గురించి మాట్లాడాడు. గతంలో ఇండియా కోసం తగినన్ని ఆటలు ఆడకపోవడం అసంతృప్తిగా ఉండేదని, ప్రస్తుతం తాను లైనప్ లో సెటిల్ అయ్యానని చెప్పాడు.
తనకు తగిన సమయం లభించడం లేదని అనుకునేవాడినని, చాలా కాలంగా జట్టులో ఉన్నానని కానీ కొద్ది ఆటలు మాత్రమే ఆడే అవకాశం వచ్చిందని, బ్యాట్స్ మన్ గా మిడిల్ లో కొత్త సమయం కావాల్సి ఉంటుందని, దేశీయ క్రికెట్ లో తాను పరుగులు చేశానని, అది తనకు బాగా పనికి వచ్చిందని ఆయన చెప్పాడు.