ఆసియా కప్: గంగూలీ ప్రకటనపై భగ్గుమన్న పాక్ బోర్డు చైర్మన్

Published : Mar 01, 2020, 11:58 AM IST
ఆసియా కప్: గంగూలీ ప్రకటనపై భగ్గుమన్న పాక్ బోర్డు చైర్మన్

సారాంశం

ఆసియా కప్ దుబాయ్ వేదిక మీద జరుగుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన ప్రకటనను పీసీబీ అధ్యక్షుడు ఎహ్సాన్ మణి ఖండించారు. ఆసియా కప్ ఎక్కడ నిర్వహించాలనే విషయంపై నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

లాహోర్: ఆసియా కప్ ఈ ఏడాది తటస్థ వేదిక దుబాయ్ లో జరుగుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగాలీ చేసిన ప్రకటనను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ ఎహ్సాన్ మణి ఖండించారు. ఆసియా కప్ నిర్వహణపై తాము ఏ విధమైన నిర్ణయం కూడా తీసుకోలేదని, అన్ని ఆసియా జట్లను సంప్రదించిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. 

ఒక వేళ తాము ఈ టోర్నీని నిర్వహించపోయినా కూడా దుబాయ్ ఒక్కటే వేదిక కాబోదని ఆయన అన్నారు. ఆసియా జట్టుకు ప్రయోజనం కలగడానికే ఈ టోర్నీని నిర్వహిస్తారని, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, అన్ని జట్లను సంప్రదించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. తమకు కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయని ఆయన అన్నారు. 

Also Read: మారిన ఆసియా కప్ వేదిక: పాక్ తో భారత్ ఆడుతుందని గంగూలీ

ఈసారి పాకిస్తాన్ ఆసియా కప్ ను నిర్వహించాల్సి ఉంది. పాకిస్తాన్ లో ఆసియా కప్ జరిగితే తాము ఆడబోమని భారత్ ప్రకటించింది. దాంతో పాకిస్తాన్ లో టోర్నీ నిర్వహించడం సందేహాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో గంగూలీ ఓ ప్రకటన చేశాడు. ఆసియా కప్ లో పాకిస్తాన్, భారత్ తలపడుతాయని అంటూ దుబాయ్ వేదికగా ఆసియా కప్ జరుగుతుందని చెప్పారు. 

2018లో భారత్ ఆసియా కప్ నిర్వహించినప్పుడు పాకిస్తాన్ భారత్ కు ఆటగాళ్లను పంపించడానికి ఇష్టపడలేదు. దీంతో ఆ టోర్నీని దుబాయ్, అబుదాబి వేదికలపై నిర్వహించారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో భార్త ఫైనల్ మ్యాచులో బంగ్లాదేశ్ ను ఒడించింది. 

ఇదిలావుంటే, మార్చి 3వ తేదీన దుబాయ్ లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సభ్య దేశాలు పాల్గొని 2020 ఆసియా కప్ టోర్నీపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

PREV
click me!

Recommended Stories

T20I Fastest Fifties: భారత్ తరఫున మెరుపు హాఫ్ సెంచరీలు బాదిన టాప్ 5 ప్లేయర్లు వీరే
Abhishek Sharma : ఇదేం బాదుడురా సామీ.. యువీ రికార్డు మిస్.. అభిషేక్ దెబ్బకు కివీస్ మైండ్ బ్లాక్