PBKS vs SRH: మొన్న టీజర్.. నేడు సినిమా చూపించిన తెలుగు కుర్రాడు..ఇంతకీ నితీష్ కుమార్ రెడ్డి ఎవరు..?

By Rajesh Karampoori  |  First Published Apr 9, 2024, 10:23 PM IST

PBKS vs SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు. ముందుగా బ్యాటింగ్  చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లో 9 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ ముందు 183 పరుగుల లక్ష్యాన్ని పెట్టింది. అయితే..  ఈ మ్యాచ్‌లో 37 బంతులు ఎదుర్కొన్న తెలుగు కుర్రాడు నితీష్‌.. 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 64 పరుగులు చేశాడు. ఈ అద్బుత ప్రదర్శనతో ఓవర్ నైట్ సార్ట్ గా మారారు. ఇంతకీ నితీష్ కుమార్ రెడ్డి ఎవరు..?


PBKS vs SRH: ఐపీఎల్‌-2024లో భాగంగా ముల్లన్పూర్ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పంజాబ్‌ కింగ్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. 
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్ రైజర్స్ కు  ఆర్ష్‌దీప్‌ సింగ్‌ బిగ్‌ షాకిచ్చాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్నింగ్స్‌లో మూడో ఓవర్‌ వేసిన అర్ష్‌దీప్‌ సింగ్‌ వరుసగా రెండు వికెట్లు పడకొట్టి భారీ షాక్ ఇచ్చారు. కానీ, ఇంతటీ ప్రెషర్ లో క్రీజ్ లో అడుగుపెట్టారు తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి .. ఉగాది రోజున తన బ్యాటింగ్ తో  సన్ రైజర్స్ ఫ్యాన్స్ కు షడ్రుచులను చూపించారు.

పంజాబ్ టాప్ బౌలర్లు మెరుపు వేగంతో బంతులు విసురుతున్నా..  అదరకుండా.. బెదరకుండా.. క్రీజ్ లో నిలిచి పరుగుల వరద పారించాడు. కేవలం 37 బంతులు ఎదుర్కొన్న ఎస్‌ఆర్‌హెచ్‌ ఆల్‌ రౌండర్‌ నితీష్‌ కుమార్‌ రెడ్డి.. ఈ ఇన్నింగ్ లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 64 పరుగులు చేశాడు. చివరికి అర్ష్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం క్రీజులో ఏ బ్యాట్స్ మెన్స్ నిలువలేకపోవడంతో ఫైనల్ గా ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.

Latest Videos

మొన్న టీజర్.. నేడు సినిమా..

ఈ సారి ఐపీఎల్ సీజన్ లో అందరీ ద్రుష్టిని ఆకర్షిస్తున్న టీం సన్‌రైజర్స్ హైదరాబాద్‌.. అందులో ప్రతి ఆటగాడు సూపర్ ఫామ్ లో ఉన్నారు. అందులో మన తెలుగువాడు మరి ప్రత్యేకం. అతడే 21 ఏండ్ల ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి. ఈ నూనుగు మీసాల కుర్రాడు అటు తన బ్యాటింగ్ తోనూ, ఇటు బౌలింగ్ తో రాణించగలడు. కానీ, తొలి మ్యాచుల్లో సీనియర్ ఫ్లేయర్ల కారణంగా బెంచ్ కే పరిమితమయ్యారు. గత మూడు రోజుల క్రితం చెన్నై సూపర్ కింగ్ తో జరిగిన మ్యాచ్ లో తొలిసారి బరిలో దిగారు.

అయితే.. తాను బ్యాటింగ్ కు వచ్చే సమయానికి జట్టు విజయానికి కేవలం 20 పరుగులే ఉండటంతో  తాను భారీ హిట్టింగ్ చేసే అవకాశం దొరకలేదు. కానీ, రెండు భారీ షాట్స్ ఆడి ఓ సూపర్ టీజర్ వదిలివెళ్లాడు. ముందు ఓ రివర్స్ స్వీప్ ఆడి బౌండరీ సాధించారు. ఆ తరువాత ఓవర్ లో తొలిబంతికే లాంగ్ ఆన్ లో భారీ సిక్స్ కొట్టి.. మ్యాచ్ ని అదిరిపోయే రీతితో ఫినిష్ చేశారు. అదికూడా కూల్ కెప్టెన్ ధోని ముందు..  అలా తన బ్యాటింగ్ తో ఓ అదిరిపోయే టీజర్ చూపిన నితీష్ రెడ్డి .. నేడు తన బ్యాటింగ్ తో సన్ రైజర్ ఫ్యాన్స్ కు ఓ మాస్ సినిమా చూపించారు. 

తన బ్యాటింగ్ విధ్వంసమే 

ఓ వైపు వరుసగా వికెట్లు కుప్పకూలింది. జట్టు పీకల లోతు కష్టాల్లో పడింది. కనీసం వంద పరుగులైన చేస్తున్నదన్న సమయంలో క్రీజులోకి వచ్చాడు నితీష్‌ కుమార్ రెడ్డి.  తన అద్భుత బ్యాటింగ్ తో అందరి ద్రుష్టిని ఆకర్షించారు. ఓ వైపు ఆచితూచి ఆడూతు.. సమయం దొరికినప్పడల్లా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. టాప్ ఆర్డర్ వికెట్లు పడుతున్నప్పటికి ఈ తెలుగు కుర్రాడు ఏ మాత్రం అదరకుండా.. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా 15 ఓవర్లో తన విశ్వరూపం చూపించారు. పంజాబ్‌ స్పిన్నర్‌ హర్‌ప్రీత్‌ బ్రార్ చేసిన ఓవర్స్లో ఏకంగా రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లతో ఏకంగా 22 పరుగులు చేసి.. తెలుగువాడి ప్రతాపం చూపించారు నితీష్ కుమార్ రెడ్డి. మొత్తానికి ఈ మ్యాచ్‌లో 37 బంతులు ఎదుర్కొన్న నితీష్‌.. 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 64 పరుగులు చేశాడు. ఈ అద్బుత ప్రదర్శనతో ఓవర్ నైట్ సార్ట్ గా మారారు.  

 ఇంతకీ నితీష్‌ కుమార్‌ రెడ్డి ఎవరు? 

 దేశవాళీ క్రికెట్‌లో ఆంధ్రా తరఫున నితీష్ కుమార్ రెడ్డి ఆడారు. ఇంత వరకు నితీష్ రెడ్డి కేవలం 8 T20లు మాత్రమే ఆడాడు. ఇందులో 2023లో 2 IPL మ్యాచ్‌లు ఆడినా.. బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. హార్దిక్ పాండ్యా,  బెన్ స్టోక్స్‌లను ఆరాధించారు నితీష్ రెడ్డి. ESPNCricinfo ప్రకారం.. బౌలింగ్ ,బ్యాటింగ్ లో రాణించి.. సన్ రైజర్స్ కు అల్ రౌండర్ గా మారారు. నితీష్ కుమార్ రెడ్డి ఆంధ్ర తరుపున రంజీ ట్రోఫీలో 7 మ్యాచ్‌లు ఆడి 366 పరుగులు చేశారు. అందులో ఒక సెంచరీ కొట్టాడు.

అలాగే.. అండర్ 19లో భారత్ B తరపున ఆడిన నితీష్ కుమార్ రెడ్డి 17 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు, ఇందులో 566 పరుగులు చేశారు.  ఐపీఎల్ 2023 వేలంలో నితీష్‌ని స్కౌర్ చేసిన తర్వాత SRH అతని బేస్ ధర రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. బ్యాట్ , బాల్ రెండింటిలోనూ రాణించగలదు. ఇలా నేడు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న నితీష్ ఓవర్ నైట్ లో సార్ట్ గా మారారు. భవిష్యత్ లో కూడా ఇలాంటి ప్రదర్శన ఇచ్చి.. టీమిండియాలో చోటు దక్కించుకోవాలని కోరుకుందాం. 
 

click me!