Shreyas Iyer: ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్ చేసే పాపులర్ 'ది గ్రేట్ ఇండియన్ కపిల్'షోకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి శ్రేయస్ అయ్యర్ హాజరయ్యాడు. ఈ షోలో రోహిత్ శర్మతో పాటు శ్రేయస్ అయ్యర్.. అభిమానులకు తెలియని చాలా విషయాలను పంచుకున్నారు.
Shreyas Iyer in Kapil Sharma Show: టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్, కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. తన ఆటతీరులో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇలా శ్రేయస్ అయ్యర్ ఓ అందమైన అమ్మాయిపై తాను మనసుపడ్డానని చెప్పారు. ఇటీవల ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారమయ్యే 'ది గ్రేట్ ఇండియన్ కపిల్'షో అనే షోలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ శ్రేయస్ అయ్యర్ హాజరయ్యాడు. ఈ సందర్బంలో తన జీవితంలోని కొన్ని ఆసక్తికర విషయాలను తన అభిమానులతో పంచుకున్నారు. ఈ షోలో హోస్ట్ కపిల్ శర్మ అడిగిన ప్రశ్నలకు తమదైన శైలిలో సమాధానమిచ్చారు. ఈ తన తొలి ప్రేమ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
ఇంతకీ ఆ అందమైన అమ్మాయి ఎవరు?
ఓ మ్యాచ్ సందర్భంగా క్రికెట్ స్టేడియానికి వచ్చిన ఓ లేడీ ఫ్యాన్ 'అయ్యర్ నన్ను పెళ్లి చేసుకుంటావా?'అనే ప్లకార్డ్ ప్రదర్శించిన ఘటన గురించి హోస్ట్ కపిల్ శర్మ ప్రస్తావించగా.. శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన తొలి ఐపీఎల్ సీజన్‌లో ఓ అందమైన అమ్మాయిని ప్రేక్షకుల స్టాండ్స్‌లో చూశాననీ, ఆ అమ్మాయివైపు చేయి చూపుతూ హలో కూడా చెప్పానని అన్నారు. వాస్తవానికి ఆ సమయంలో తాను ఫేస్‌బుక్ చాలా యాక్టివ్ గా ఉండే వాడిననీ, తనకు మెసేజ్ చేస్తుందేమోనని చాలా ఎదురు చూశానని చెప్పాడు.
నిజానికి ఈ ఘటన చాలా సంవత్సరాల కిత్రం జరిగింది. శ్రేయాస్ అయ్యర్ IPLలో తన మొదటి సీజన్‌ను ఢిల్లీ తరపున ఆడుతున్నప్పుడు.. ఈ సమయంలో అతను మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియంలో కూర్చున్న అమ్మాయి తనని పెళ్లి చేసుకుంటావని ప్లకార్డ్ ప్రదర్శించింది. ఆ మ్యాచ్ తరువాత ఆ అమ్మాయి కోసం సోషల్ మీడియాలో చాలా వెతికాడు. ఆ అమ్మాయి తన కోసం సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టి ఉండొచ్చని శ్రేయస్ భావించాడు. తన సోషల్ మీడియా ఖాతాలన్నీ వెతికాడు. కానీ ఆ అమ్మాయి నుంచి అతనికి ఎలాంటి మెసేజ్ రాలేదు. కపిల్ శర్మ షోలో రోహిత్ శర్మ ముందు అయ్యర్ ఈ సీక్రెట్ ను రిలీవ్ చేయడంతో అక్కడ ఉన్న ప్రేక్షకులు ఓ సారిగా నవ్వేశారు.