RCB vs PBKS: పంజాబ్ vs బెంగళూరు.. టాస్ గెలిచారు.. మ్యాచ్ గెలిచేది ఎవరు?

Published : May 29, 2025, 07:16 PM IST
Virat Kohli

సారాంశం

IPL 2025 Qualifier 1 RCB vs PBKS: ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 1 మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుకుంటుంది. ఈ మ్యాచ్ టాస్ పడింది. మ్యాచ్ ను గెలిచేది ఎవరు?

PBKS vs RCB Qualifier 1 IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ క్వాలిఫయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) - పంజాబ్ కింగ్స్ (PBKS) తలపడుతున్నాయి. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన బెంగళూరు జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో పంజాబ్ టీమ్ మొదట బ్యాటింగ్ చేయనుంది.

ఐపీఎల్ లో ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన ముంబై ఇండియన్స్‌ను గత మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో ఓడించిన జోష్ లో పంజాబ్ టీమ్ మ్యాచ్ ను ఆడుతోంది. అలాగే, మరో ఓవర్ మిగిలి వుండగానే 230 పరుగులు చేసి లక్నో సూపర్ జెయింట్స్ ను ఓడించిన ఆర్సీబీ ఇప్పుడు అదే జోరును పంజాబ్ పై కూడా కొనసాగించాలని చూస్తోంది.

ఐపీఎల్ 2025 సీజన్ క్వాలిఫయర్ 1 పంజాబ్ జట్టు ప్లేయింగ్ XI

ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, కైల్ జామీసన్.

పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్‌: విజయ్‌కుమార్ వైషాక్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, ముషీర్ ఖాన్, జేవియర్ బార్ట్‌లెట్.

ఐపీఎల్ 2025 సీజన్ క్వాలిఫయర్ 1 బెంగళూరు జట్లు ప్లేయింగ్ XI

విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంపాక్ట్ సబ్: మయాంక్ అగర్వాల్, రసిఖ్ సలామ్, మనోజ్ భాండాగే, టిమ్ సీఫెర్ట్, స్వప్నిల్ సింగ్.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA : గిల్ రెడీనా? భారత జట్టులోకి ముగ్గురు స్టార్ల రీఎంట్రీ
Smriti Mandhana: ఔను.. నా పెళ్లి రద్దయింది.. స్మృతి మంధాన, పలాష్ ముచ్ఛల్ సంచలన పోస్టులు