క్షీణిస్తున్న తల్లి ఆరోగ్యం.. మరికొన్నాళ్లు సిడ్నీలోనే ఆసీస్ సారథి.. వన్డే సిరీస్‌కూ డౌటే..!

Published : Feb 27, 2023, 04:46 PM ISTUpdated : Feb 27, 2023, 04:49 PM IST
క్షీణిస్తున్న తల్లి ఆరోగ్యం.. మరికొన్నాళ్లు సిడ్నీలోనే  ఆసీస్ సారథి.. వన్డే సిరీస్‌కూ  డౌటే..!

సారాంశం

INDvsAUS:  ఆస్ట్రేలియా సారథి  పాట్ కమిన్స్ తల్లి ఆరోగ్యం నానాటికీ  ఆందోళనకరంగా మారుతున్నది.  కమిన్స్  తల్లి  క్యాన్సర్ తో ఇబ్బందిపడుతున్న విషయం తెలిసిందే. 

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా  భారత పర్యటనకు వచ్చి ఢిల్లీ టెస్టు ముగిసిన తర్వాత  తిరిగి ఆస్ట్రేలియాకు పయనమైన ఆ జట్టు సారథి మిగిలిన రెండు టెస్టులతో పాటు  వన్డే సిరీస్ కూ వచ్చేది అనుమానంగానే ఉంది. అతడి  తల్లి ప్రస్తుతం క్యాన్సర్ తో సిడ్నీలోని  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తల్లి చికిత్స కోసం  సిడ్నీ వెళ్లిన  కమిన్స్.. వన్డే సిరీస్ కు వచ్చేదని అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 

ఢిల్లీ టెస్టు ముగిసిన తర్వాత  కమిన్స్ సిడ్నీకి వెళ్లాడు. అయితే ఢిల్లీ, ఇండోర్ టెస్టుకు మధ్యలో పది రోజుల గ్యాప్ దొరకడంతో  కమిన్స్ తిరిగి  జట్టుతో చేరతాడని అంతా ఊహించారు.  కానీ  అతడి తల్లి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా  కమిన్స్ మరికొన్నాళ్లు అక్కడే ఉండనున్నాడని తెలుస్తున్నది.  

తన తల్లిని దగ్గరుండి చూసుకుంటున్న కమిన్స్ కూడా  క్రికెట్ ఆస్ట్రేలియాకు ఇదే విషయం చెప్పాడట. తన సెలవులను పొడిగించాలని  కమిన్స్ కోరిన అభ్యర్థనను ఆస్ట్రేలియా బోర్డు కూడా అంగీకరించిందని సమాచారం. ఇదే నిజమైతే  ఆస్ట్రేలియా మిగిలిన రెండు టెస్టులతో పాటు మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను కూడా రెగ్యులర్ కెప్టెన్ లేకుండానే ఆడనున్నది. మార్చి 17 నుంచి వన్డే సిరీస్ మొదలుకావాల్సి ఉన్నది. 

ఇదిలాఉండగా కమిన్స్ తల్లి ఆరోగ్యం బాగుండాలని, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్  అభిమాన సంఘం అయిన బర్మీ ఆర్మీ ప్రత్యేక ట్వీట్ చేసింది.  తన ట్విటర్ వేదికగా   ఓ వీడియోను  పోస్ట్ చేస్తూ..  ప్రముఖ చిత్రం  వెస్ట్ సైడ్ స్టోరీలోని  మరియా మ్యూజిక్ ఆంథెమ్ ను  కమిన్స్ తల్లి కోసం షేర్ చేసింది. కమిన్స్ తల్లి పేరు కూడా మరియానే కావడం గమనార్హం.    

 

ఈ వీడియోకు కమిన్స్ స్పందించాడు. ‘థ్యాంక్యూ బర్మీ ఆర్మీ. ఇది చాలా బాగుంది. ఈ వీడియో మా అమ్మకు కూడా నచ్చింది..’అని ట్వీట్ చేశాడు. కమిన్స్ తల్లి  త్వరగా కోలుకోవాలని నెటిజన్లు, ఆస్ట్రేలియా క్రికెట్ ఫ్యాన్స్  అతడికి మద్దతుగా నిలుస్తున్నారు.  కుటుంబం చాలా ముఖ్యమని.. కుటుంబం తర్వాతే ఏదైనా అని  కమిన్స్ కు అండగా నిలిచారు. 

 

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !