3కోట్ల వ్యూస్ కి చేరువలో ధోనీ రిటైర్మెంట్ పాట..

Published : Aug 17, 2020, 01:09 PM ISTUpdated : Aug 17, 2020, 01:18 PM IST
3కోట్ల వ్యూస్ కి చేరువలో ధోనీ రిటైర్మెంట్ పాట..

సారాంశం

సాహిర్‌ లుధియాన్వి రచించిన ఈ పాటను ప్రఖ్యాత గాయకుడు ముఖేష్‌ ఆలపించారు. అప్పట్లో ఈ సాంగ్‌ విశేష ఆదరణ పొందింది. క్రికెట్‌లో తన 16 ఏళ్ల తన జర్నీని తెలిపే బెస్ట్‌ మూమెంట్స్‌తో కూడిన ఫొటోలను ఆ పాటతో మిక్స్‌ చేశాడు ధోని. 

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. తాజాగా రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. గతేడాది వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత  ధోనీ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టింది లేదు. అప్పటి నుంచి ఆయన మళ్లీ ఎప్పుడు బ్యాట్ పట్టుకుంటారా అని ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ లోపే ధోనీ తన రిటైర్మెంట్ ఎనౌన్స్ చేశారు.

‘నేనో రెండు నిముషాల కవిని. నాదో చిన్న ప్రయాణం. నాలా ఎందరో వచ్చారు. వెళ్లారు. నేనూ అంతే. మరెందరో నాలాంటి వారు వస్తారు’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో ఓ పాట రూపంలో వెల్లడించాడు. 1976లో వచ్చిన సూపర్‌హిట్‌ మూవీ ‘కభీ కభీ’లోని ‘మై పల్‌ దో పల్‌ కా షాయర్‌’ పాటను ధోని షేర్‌ చేశాడు.

సాహిర్‌ లుధియాన్వి రచించిన ఈ పాటను ప్రఖ్యాత గాయకుడు ముఖేష్‌ ఆలపించారు. అప్పట్లో ఈ సాంగ్‌ విశేష ఆదరణ పొందింది. క్రికెట్‌లో తన 16 ఏళ్ల తన జర్నీని తెలిపే బెస్ట్‌ మూమెంట్స్‌తో కూడిన ఫొటోలను ఆ పాటతో మిక్స్‌ చేశాడు ధోని. ఈ పాట 2,86,09,653 వ్యూస్‌ సాధించి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. 64,77,407 మంది ఈ వీడియోను లైక్‌ చేశారు. క్రికెట్‌ జ్ఞానిగా పేరుతెచ్చుకున్న ధోని, వీడ్కోలుకు సంబంధించి ఉద్వేగభరితమైన పాత పాటను ఎంచుకోవడం విశేషం.


 

PREV
click me!

Recommended Stories

IND vs BAN : తగ్గేదే లే.. బంగ్లాదేశ్ కు ఇచ్చిపడేసిన భారత్.. గ్రౌండ్‌లో హీట్ పుట్టించిన కెప్టెన్లు !
Vaibhav Suryavanshi : ఊచకోత అంటే ఇదే.. బంగ్లా బౌలర్లని ఉతికారేసిన వైభవ్ ! కోహ్లీ రికార్డు పాయే