బ్రేకింగ్: కరోనాతో టీమిండియా మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ మృతి

By Siva KodatiFirst Published Aug 16, 2020, 6:34 PM IST
Highlights

భారతదేశంలో కరోనా కారణంగా మరో ప్రముఖుడు కన్నుమూశాడు. టీమిండియా మాజీ క్రికెటర్, ఉత్తరప్రదేశ్ మంత్రి చేతన్ చౌహాన్ కోవిడ్‌తో మరణించారు. ఆయన వయసు 73 సంవత్సరాలు.

భారతదేశంలో కరోనా కారణంగా మరో ప్రముఖుడు కన్నుమూశాడు. టీమిండియా మాజీ క్రికెటర్, ఉత్తరప్రదేశ్ మంత్రి చేతన్ చౌహాన్ కోవిడ్‌తో మరణించారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. జూలై 12న కరోనా పాజిటివ్‌గా తేలడంతో చేతన్‌ను లక్నోలోని సంజయ్ గాంధీ పీజీఐ ఆసుపత్రిలో చేర్చారు.

అక్కడ ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో చేతన్‌ను గురుగ్రామ్‌లోని మేదాంతకు తరలించారు. గత కొన్ని రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. 

టీమిండియా 1969లో ఎంట్రీ ఇచ్చిన చేతన్ చౌహాన్ 40 టెస్టులాడి 2,084 పరుగులు చేశాడు. అలానే ఆడిన 7 వన్డేల్లో 153 పరుగులు చేశాడు. 1981లో అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన చౌహాన్.. కెరీర్‌లో కనీసం ఒక్క సెంచరీని కూడా నమోదు చేయలేకపోయాడు.

ఓపెనర్‌గా చేతన్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. సునీల్ గావస్కర్‌తో కలిసి ఓపెనింగ్‌కు దిగిన ఆయన 40 టెస్టుల్లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. వీరిద్దరూ కలిసి సుమారు 3,000 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 

1981లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత చేతన్ చౌహాన్ రాజకీయాల్లోనూ రాణించారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ మంత్రిగా సేవలందిస్తున్నారు. 

click me!