ఇంగ్లాండ్ విమానాశ్రయంలో పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ నిర్భందం...

Published : Jul 23, 2019, 09:22 PM IST
ఇంగ్లాండ్ విమానాశ్రయంలో పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ నిర్భందం...

సారాంశం

మాంచెస్టర్ విమానాశ్రయంలో పాకిస్థాన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ను అధికారులు నిర్భందించి తనిఖీ చేశారు. ఇలా తనపట్లు దురుసుగా ప్రవర్తించి అవమానించిన విమానాశ్రయ అధికారుల పట్ల ఆయన తీవ్ర ఆగ్రహాన్నివ్యక్తం చేశారు.    

పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ  కెప్టెన్ వసీం అక్రమ్ ఇంగ్లాండ్ లో తీవ్రంగా అవమానించబడ్డాడు. తన పట్ల మాంచెస్టర్ విమానాశ్రయ భద్రతా సిబ్బంది చాలా అమర్యదగా వ్యవహరించారంటూ స్వయంగా వసీం  అక్రమ్ వెల్లడించారు. మాజీ క్రికెటర్, క్రికెట్ వ్యాఖ్యాతగా ప్రపంచ దేశాలన్నింటిని పర్యటించే తనకు ఎప్పుడూ  ఇలాంటి అనుభవం ఎదురవలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  

''ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ విమానాశ్రయంలో ఇవాళ అధికారులు చాలా అవమానకరంగా వ్యవహరించారు. నేను ఎప్పుడు విదేశీ పర్యటనలకు  వెళ్లినా ఇన్సులిన్ ను వెంట తీసుకెళతా. కానీ  ఎప్పుడూ ఎప్పుడూ ఇలాంటి అవమానకర పరిస్థితి ఎదురవలేదు. నా పట్ల విమానాశ్రయ అధికారులు చాలా అమర్యాదగా వ్యవహరించడమే కాదు  చాలా దారుణంగా ప్రశ్నించారు. ప్రయాణికులందరి ముందే కోల్డ్ కేస్ లో వున్న ఇన్సులిన్ ని బయటకు తీసి...ప్లాస్టిక్ సంచిలో పడేశారు.'' అంటూ తనకు జరిగిన అవమానం గురించి వివరిస్తూ ట్వీట్ చేశాడు. 
 
''అక్కడ ఎవ్వరితో ప్రవర్తించని  విధంగా నాతో  ప్రవర్తించారు. అలా అవమానకరంగా వ్యవహరిస్తారని నేను అస్సలు ఊహించలేదు. అందరితోనూ చాలా మర్యాదగా వ్యవహరించి నా ఒక్కడితోనే అలా ప్రవర్తించారు. రక్షణ చర్యల్లో భాగంగా కఠినంగా  వ్యవహరించడాన్ని నేను అర్థం చేసుకుంటాను...కానీ ఆ పేరుతో ప్రయాణికులను  ఇబ్బంది పెట్టడం మంచిదికాదు.'' అని వసీం అక్రమ్ మాంచెస్టర్ విమానాశ్రయ అధికారుల తీరు మార్చుకోవాలని సూచించారు. 

 

PREV
click me!

Recommended Stories

IPL Mini Auction 2026: మినీ వేలంలో జాక్‌పాట్ కొట్టే ప్లేయ‌ర్స్ వీళ్లే... ఏకంగా రూ. 30 కోట్ల పైమాటే..
IPL 2026 Auction: చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కెచ్.. రూ. 43 కోట్లతో ఆ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే !