హిందువు కాబట్టే: కనేరియాపై షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

Published : Dec 27, 2019, 08:24 AM ISTUpdated : Dec 27, 2019, 10:33 AM IST
హిందువు కాబట్టే: కనేరియాపై షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

కనేరియా విషయంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సంచలన విషయాలు వెల్లడించారు. హిందువు కాబట్టి కనేరియా పట్ల తమ క్రికెట్ జట్టు సహచరులు అతని పట్ల అమానుషంగా ప్రవర్తించేవారని చెప్పారు.

ఇస్లామాబాద్: క్రికెటర్ డనీష్ కనేరియా విషయంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువు కాబట్టే పాకిస్తాన్ క్రికెట్ సహచరులు కనేరియా పట్ల అవమానకరకంగా ప్రవర్తించారని ఆయన అన్నారు. ఓ చాట్ షోలో ఆయన ఆ విషయం చెప్పారు. 

అంతర్జాతీయ క్రికెట్ లో పాకిస్తాన్ ప్రాతినిధ్యం వహించిన రెండో హిందువు కనేరియా. అంతకు ముందు అనిల్ దల్పాట్ పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించాడు. విశ్వాసం కారణంగా తమ బల్ల నుంచి ఆహారం తీసుకోవడాన్ని కూడా కనేరియాను అనుమతించేవారు కారని అన్నారు. 

తమతో కలిసి తింటున్నప్పుడు లేదా తాము తీసుకున్న బల్ల నుంచే ఆహారం తీసుకున్నప్పుడు కనేరియాపై కెప్టెన్ గుడ్లు ఉరిమి చూసేవాడని అన్నారు. కెప్టెన్ లా వ్యవహరించాలని, కానీ అలా చేయడం లేదని తాను కెప్టెన్ కు చెప్పానని అన్నాడు. 

కనేరియా చాలా మ్యాచులు గెలవడానికి తగినట్లుగా ఆడుతున్నాడని, నువ్వు అతని పట్ల అలా ప్రవర్తిస్తున్నావని అన్నట్లు తెలిపారు. గేమ్ ఆన్ హై అనే కార్యక్రమంలో షోయబ్ అక్కర్ ఆ విషయాలు వెల్లడించారు.

 

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు