మరోసారి పరువు తీసుకున్న కమ్రాన్ అక్మల్... పాక్ స్వాతంత్య్ర దినోత్సవ పోస్టుపై...

Published : Aug 14, 2021, 03:55 PM IST
మరోసారి పరువు తీసుకున్న కమ్రాన్ అక్మల్... పాక్ స్వాతంత్య్ర దినోత్సవ పోస్టుపై...

సారాంశం

పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పాక్ మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కమ్రాన్ అక్మల్ పోస్టు... స్పెల్లింగ్ మిస్టేక్‌తో ఇండిపెండెంట్ డే విషెస్...

పాకిస్తాన్ క్రికెటర్ల పరువు ఎవ్వరూ తీయక్కర్లేదు, ఎందుకంటే వాళ్ల పరువు వాళ్లే తీసుకుంటారు... బట్లర్ ఇంగ్లీషుతో అనేకసార్లు అబాసుపాలైన పాక్ క్రికెటర్లు, మళ్లీ మళ్లీ ఇలాంటి విజ్ఞాన ప్రదర్శనలతోనే ట్రోలింగ్‌కి టార్గెట్ అవుతున్నారు...

పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పాక్ మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కమ్రాన్ అక్మల్... సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశాడు. అయితే ఇందులో ఇండిపెండెన్స్ డే స్పెలింగ్‌ తప్పుగా ఉంది.

‘Independence’ అని రాయడానికి బదులుగా, ‘Indepence’ అని రాసి ఉన్న ఫోటోను పోస్టు చేశాడు కమ్రాన్ అక్మల్. దీంతో కనీసం ఇండిపెండెన్స్ డే స్పెల్లింగ్ కూడా రాకుండా అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ టోర్నీలు ఎలా ఆడావంటూ కొందరు విమర్శలు చేస్తుంటే.. పాక్ ఫ్యాన్స్ మాత్రం మరోలా రియాక్ట్ అవుతున్నారు. 

రెండు వందల ఏళ్లు అఖండ భారతాన్ని పాలించిన బ్రిటీష్ వారిపై, ఆంగ్లేయులపై ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో కమ్రాన్ అక్మల్‌కి బాగా తెలుసని, అందుకని వారి ఇంగ్లీష్‌ని కూనీ చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. తన పోస్టుపై బీభత్సమైన ట్రోలింగ్ వస్తున్నా... కమ్రాన్ అక్మల్ తన పోస్టుని డిలీట్ చేయకపోవడం విశేషం..  

PREV
click me!

Recommended Stories

ఐపీఎల్ ముద్దు.. హనీమూన్ వద్దు.. నమ్మకద్రోహం చేసిన ఆసీస్ ప్లేయర్.. పెద్ద రచ్చ జరిగేలా ఉందిగా
విదేశీ లీగ్‌ల్లో ఆడనున్న రో-కో.. ఐపీఎల్ చైర్మన్ ఏమన్నారంటే.?