అయ్యో పాపం, క్లీన్‌బౌల్డ్ చేసి, దండం పెట్టి సారీ చెప్పాడు... ఆఫ్రిదీకి వింత అనుభవం...

By team teluguFirst Published Nov 16, 2020, 5:21 PM IST
Highlights

పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో డకౌట్ అయిన షాహిద్ ఆఫ్రిదీ...

మొదటి బంతికే క్లీన్‌బౌల్డ్ చేసి, దండం పెడుతూ సారీ చెప్పిన హారీస్ రావూఫ్..

సోషల్ మీడియాలో వీడియో వైరల్...

పాకిస్థాన్ క్రికెట్ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిదీకి ఓ ప్రత్యేకమైన టాలెంట్ ఉంది. ఆడితే సిక్సర్లతో మోత మోగించే ఆఫ్రిదీ, లేదంటే డకౌట్ అయి పెవిలియన్ చేరతాడు. అందుకే ఆఫ్రిదీ ఆటను ‘అడ్డి మారి గుడ్డి ఆట’ అంటూ ట్రోల్ చేస్తూ ఉంటారు చాలా మంది. తాజాగా పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో కూడా ఇలాగే ఆటను చూపిస్తున్నాడు షాహిద్ ఆఫ్రిదీ.

లాహోర్ ఖలందర్, ముల్తాన్ సుల్తాన్ మధ్య జరిగిన రెండో ఎలిమినేటర్ మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు షాహిద్ ఆఫ్రిదీ. లాహోర్ బౌలర్ హారిస్ రావూఫ్ బౌలింగ్‌లో మొదటి బంతికే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు ఆఫ్రిదీ. అయితే ఆఫ్రిదీని అమితంగా అభిమానించే హారిస్... అతను అవుట్ అయిన తర్వాత దండం పెడుతూ సారీ చెప్పడం బాగా వైరల్ అవుతోంది...

ఈ మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్‌పై 67 పరుగుల తేడాతో గెలిచిన లాహోర్ ఖలందర్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. బ్రేక్ తర్వాత మొదలైన పీఎస్‌ఎల్ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 17న జరగనుంది. ఈ మ్యాచ్‌లో కరాచీ కింగ్స్‌తో ఫైనల్ టైటిల్ ఫైట్ చేయనుంది లాహోర్.

 

LALA I'M SORRY 😭🙏🏾 pic.twitter.com/QoMJG5Lhht

— PakistanSuperLeague (@thePSLt20)

 

click me!