పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదికి కరోనా!

By Sree s  |  First Published Jun 13, 2020, 2:47 PM IST

తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది కరోనా పాజిటివ్ గా తేలాడు. ఈ విషయాన్నీ ట్విట్టర్ వేదికగా స్వయంగా షాహిద్ ఆఫ్రిదియే  వెల్లడించాడు. తనకు గురువారం నుంచి ఒంట్లో బాగోలేదని, ఒళ్ళంతా నొప్పులు ఉండడంతో ఆసుపత్రికి వెళ్లి కరోనా పరీక్షలు చేపించుకుంటే... కరోనా పాజిటివ్ అని తేలిందన్నారు.


కరోనా వైరస్ పేద, ధనిక, సెలెబ్రిటీలు, సామాన్యులు మధ్య తేడా లేకుండా, తనకు అందరూ సమానులే అన్నట్టుగా వ్యవహరిస్తోంది. తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది కరోనా పాజిటివ్ గా తేలాడు. 

ఈ విషయాన్నీ ట్విట్టర్ వేదికగా స్వయంగా షాహిద్ ఆఫ్రిదియే  వెల్లడించాడు. తనకు గురువారం నుంచి ఒంట్లో బాగోలేదని, ఒళ్ళంతా నొప్పులు ఉండడంతో ఆసుపత్రికి వెళ్లి కరోనా పరీక్షలు చేపించుకుంటే... కరోనా పాజిటివ్ అని తేలిందన్నారు. త్వరగా కోలుకోవడానికి అందరి ప్రార్థనలు కావాలని కోరాడు. 

I’ve been feeling unwell since Thursday; my body had been aching badly. I’ve been tested and unfortunately I’m covid positive. Need prayers for a speedy recovery, InshaAllah

— Shahid Afridi (@SAfridiOfficial)

Latest Videos

కరోనా వైరస్ పాజిటివ్ గా తేలిన మూడవ పాకిస్తానీ క్రికెటర్ గా షాహిద్ ఆఫ్రిది నిలిచాడు. ఇప్పటికే తౌఫీక్ ఉమర్, సర్ఫరాజ్ కరోనా పాజిటివ్ గా తేలిన విషయం తెలిసిందే. స్కాట్లాండ్, సౌత్ ఆఫ్రికా క్రికెటర్లకు కూడా ఇద్దరికి కరోనా సోకింది. 

కరోనా కష్టకాలంలో షాహిద్ ఆఫ్రిది ఫౌండేషన్ ద్వారా షాహిద్ ఆఫ్రిది సమాజసేవ కార్యక్రమాలను చేస్తున్నాడు. ఇలా కార్యక్రమాలు చేస్తుండగానే ఎక్కడైనా తనకు వైరస్ సోకి ఉండవచ్చని సమాచారం. 

click me!