వందేళ్ల భారత మాజీ క్రికెటర్ మృతి

Published : Jun 13, 2020, 02:02 PM IST
వందేళ్ల భారత మాజీ క్రికెటర్ మృతి

సారాంశం

శనివారం మధ్యాహ్నం దక్షిణ ముంబైలోని చందన్‌వాడి శ్మశానవాటికలో క్రికెట్ చరిత్రకారుడు వసంత్ రాయ్‌జీ దహన సంస్కారాలు నిర్వహించనున్నట్టు సమాచారం తెలుస్తోంది.

భారత మాజీ క్రికెటర్ వసంత్ రాయ్‌జీ శనివారం తెల్లవారుజామున ముంబైలోని ఆయన నివాసంలో కన్నుమూశారు. రాయ్‌జీ వయసు 100 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 

వృద్ధాప్యం కారణంగా దక్షిణ ముంబైలోని వాల్కేశ్వర్‌లోని తన నివాసంలో నిద్రలోనే ఈరోజు తెల్లవారుజామున 2.20 గంటలకు రాయ్‌జీ కన్నుమూశారని ఆయన అల్లుడు సుదర్శన్ నానావతి తెలిపారు.

శనివారం మధ్యాహ్నం దక్షిణ ముంబైలోని చందన్‌వాడి శ్మశానవాటికలో క్రికెట్ చరిత్రకారుడు వసంత్ రాయ్‌జీ దహన సంస్కారాలు నిర్వహించనున్నట్టు సమాచారం తెలుస్తోంది. 1920 జనవరి 26న గుజరాత్ లోని బరోడాలో రాయ్‌జీ జన్మించారు. 

1939లో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా జట్టు తరపున ఆయన అరంగేట్రం చేశారు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌ అయిన రాయ్‌జీ.. 1949-50 వరకు బరోడా, ముంబై జట్టుకు సేవలందించారు. ఫస్ట్ క్లాస్‌ క్రికెట్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా ఆయన విశేష సేవలందించారు.

PREV
click me!

Recommended Stories

T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !
T20 World Cup: దటీజ్ ఇషాన్ కిషన్.. వరల్డ్ కప్ జట్టులో చోటు కోసం ఏం చేశాడో తెలుసా?