పాకిస్థాన్ ఆశలపై నీళ్లు చల్లిన సౌరవ్ గంగూలీ

By Sree sFirst Published Jun 12, 2020, 10:29 AM IST
Highlights

ఐసీసీ నిర్ణయం గురించి వేచి చూస్తున్నామని చెబుతూనే బీసీసీఐ మాత్రం ఐపీఎల్ కు సన్నాహాలను చకచకా చేస్తుంది. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు ఐపీఎల్ నిర్వహణకు సిద్ధంగా ఉండాలని లేఖలు రాసారు. 

టి20 ప్రపంచ కప్ పై ఐసీసీ ఎటి తేల్చడం లేదు. ఏది ఏమైనా టి20 ప్రపంచ కప్ మాత్రం వాయిదా పాడడం ఖాయంగా కనబడుతోంది. దాదాపుగా అన్ని దేశాలు కూడా టి20 ప్రపంచ కప్ వాయిదా గురించే పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ ప్రపంచ కప్ వాయిదా తథ్యంగా కనబడుతుంది. 

ఇకపోతే... ఐసీసీ నిర్ణయం గురించి వేచి చూస్తున్నామని చెబుతూనే బీసీసీఐ మాత్రం ఐపీఎల్ కు సన్నాహాలను చకచకా చేస్తుంది. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు ఐపీఎల్ నిర్వహణకు సిద్ధంగా ఉండాలని లేఖలు రాసారు. 

ఇక గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ ఏకంగా సెప్టెంబర్ - అక్టోబర్ సీజన్లో ఐపీఎల్ నిర్వహించేందుకు సర్వం సిద్ధం అని తెలిపారు. ఇలా టి20 ప్రపంచ కప్ వాయిదా, ఐపీఎల్ నిర్వహణ దెబ్బకు ఆసియ కప్ సందిగ్ధంలో పడింది. 

ఆసియాకప్‌ సైతం రద్దు... పాక్ ఆశలపై నీళ్లు? 

ఐపీఎల్‌ నిర్వహణపై బీసీసీఐ ప్రకటనతో 2020 ఆసియాకప్‌పై సందిగ్ధం కొనసాగుతోంది. షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబర్‌లో ఆసియా కప్‌ నిర్వహించాలి. పాకిస్థాన్‌ తన ఆతిథ్య హక్కులను శ్రీలంకకు బదిలీ చేసింది. 

బదులుగా శ్రీలంక నుంచి 2022 ఆసియాకప్‌ ఆతిథ్య హక్కులను పొందనుంది. మంగళవారం సమావేశమైన ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ టోర్నీపై స్పష్టతకు రాలేదు. వరల్డ్‌కప్‌పై ఐసీసీ నిర్ణయం వెలువడిన తర్వాతే ఆసియా కప్‌పై ప్రకటన చేయాలని నిశ్చయించింది. 

ఈ ఏడాది ఏ సమయంలోనైనా, ఎక్కడైనా ఆసియాకప్‌ నిర్వహణ పట్ల బీసీసీఐ ఆసక్తి చూపించటం లేదు. ఆసియా కప్‌ షెడ్యూల్‌ సెప్టెంబర్‌లో ఇప్పుడు ఐపీఎల్‌ ఆరంభానికి ప్లాన్‌ చేస్తోంది. ఆగష్టులో శ్రీలంక పర్యటనకు గ్రీన్‌ సిగల్‌ ఇవ్వటం ద్వారా శ్రీలంక క్రికెట్‌ బోర్డు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.

ఆసియ కప్ లో ఆడేది భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బాంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్. పాకిస్తాన్ మినహా అన్ని దేశాల క్రికెటర్లు కూడా ఐపీఎల్ ఆడుతున్నవారే. ఆయా దేశాల బోర్డులకు, ప్లేయర్లకు  ఆసియ కప్ మీద వచ్చే ఆదాయం కన్నా ఐపీఎల్ వల్ల వచ్చే ఆదాయం ఎక్కువ. దానితోపాటుగా బీసీసీఐ అవసరమైతే ఆయా దేశాలతో ఒక ద్వైపాక్షిక సిరీస్ కూడా ఆడతామని ఒక ఆఫర్ కూడా ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. 

కరోనా దెబ్బకు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న క్రికెట్ బోర్డులు ఇప్పుడు బీసీసీఐ మాట ఖచ్చితంగా వింటాయి. ఆసియ కప్ ఎలాగైనా నిర్వహించాలి అని అనుకుంటున్న పాకిస్తాన్ ఆశలపై విజయవంతంగా నీళ్లు చెల్లుతుంది బీసీసీఐ. 

click me!