
Pakistan Coach Mike Hesson: ఆసియా కప్‌లో ఆదివారం జరగబోయే హైవోల్టేజ్ మ్యాచ్ ముందు ఇండియాకు పాకిస్తాన్ కోచ్ మైక్ హెస్సన్ వార్నింగ్ ఇచ్చారు. ఒమన్‌తో మ్యాచ్ ముందు జరిగిన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్, ఆసియా కప్ విన్నర్ అయిన ఇండియాను ఢీకొట్టడానికి పాకిస్తాన్ రెడీగా ఉందని అన్నారు.
“ఇండియా మంచి ఫామ్‌లో ఉంది, కాన్ఫిడెంట్‌గా ఉంది అని మాకు తెలుసు. వాళ్ళ రీసెంట్ పెర్ఫార్మెన్స్ చూస్తే అర్థమవుతుంది. కానీ మేము కూడా బాగా ఇంప్రూవ్ అవుతున్నాం. ముందున్న ఛాలెంజ్ గురించి మాకు తెలుసు. దాన్ని ఎదుర్కోవడానికి మేము రెడీగా ఉన్నాం” అని మైక్ హెస్సన్ అన్నారు. అలాగే, “మా బౌలింగ్ డిపార్ట్‌మెంట్ స్ట్రాంగ్‌గా ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం వరల్డ్ బెస్ట్ స్పిన్నర్ అయిన మొహమ్మద్ నవాజ్ మా టీమ్‌లో ఉన్నారు. ఆసియా కప్ ముందు జరిగిన ట్రై సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై హ్యాట్రిక్ తీసిన నవాజ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. నవాజ్ సహా ఐదుగురు స్పిన్నర్లు మా బౌలింగ్ స్ట్రెంత్” అని హెస్సన్ అన్నారు.
నవాజ్‌తో పాటు అబ్రార్ అహ్మద్, షౌఫియాన్ ముఖీమ్, సయీమ్ అయూబ్ కూడా టీమ్‌లో ఉన్నారు. సయీమ్ మంచి ఆల్‌రౌండర్ కూడా. వీళ్ళతో పాటు కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా కూడా ఉంటే ఏ టీమ్‌కైనా పోటీ ఇవ్వగలం అని హెస్సన్ అన్నారు. షార్జాలో స్పిన్నర్లకు అనుకూలంగా ఉన్న పిచ్.. దుబాయ్‌లో ఉండకపోవచ్చని కూడా అన్నారు.
యూఏఈతో మ్యాచ్‌లో ఇండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో అదరగొట్టాడు కానీ, బాల్‌కి పెద్దగా టర్న్ దొరకలేదు. కానీ పిచ్ నుంచి సపోర్ట్ లేకపోయినా, రిస్ట్ స్పిన్నర్లు ఏ పరిస్థితుల్లోనైనా సక్సెస్ అవ్వగలరు అని హెస్సన్ అన్నారు. ఆసియా కప్‌లో మొదటి మ్యాచ్‌లో ఒమన్‌తో ఆడిన పాకిస్తాన్ జట్టే.. ఆదివారం ఇండియాతో ఆడనుందని సమాచారం. గెలుపుతో టోర్నీని మొదలుపెట్టిన పాకన్.. యూఏఈపై తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచి ఫుల్ జోష్ లో ఉన్న భారత్ తో రెండో మ్యాచ్ ను ఆడనుంది.
పెహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత క్రికెట్ ప్రపంచంలో బద్ధ శత్రువులైన ఇండియా, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. అందుకే ఈ మ్యాచ్‌పై చాలా ఆసక్తి నెలకొంది. ఆసియా కప్ టోర్నమెంట్ మొదలవ్వకముందే టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాకిస్తాన్‌పై తాను దూకుడుగా ఆడతానని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు పాక్ కోచ్ కూడా మేము ఇండియా ఛాలెంజ్‌కి రెడీ అనే మెసేజ్ ఇచ్చారు. అందుకే ఇండియా-పాక్ మ్యాచ్ ఉత్కంఠ రోజురోజుకీ పెరుగుతోంది.
ఆసియా కప్ టోర్నమెంట్‌లో ప్రస్తుత ఛాంపియన్ టీమ్ ఇండియా ఎనిమిది సార్లు విజేతగా నిలిచింది. ఇప్పుడు సూర్య సేన తొమ్మిదో ట్రోఫీ కోసం ఎదురుచూస్తోంది. మరోవైపు, పాకిస్తాన్ కేవలం రెండు సార్లు మాత్రమే ఆసియా కప్ గెలిచింది. బాబర్ అజామ్, మొహమ్మద్ రిజ్వాన్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్ళ లేకపోవడం పాకిస్తాన్‌కి ఇబ్బంది కలిగించవచ్చు. గత ఆసియా కప్‌లో పాకిస్తాన్ ఫైనల్‌కి చేరుకోలేకపోయింది.