ఔటయ్యావు వెళ్లన్న కీమో పాల్... బ్యాట్‌తో కొట్టబోయిన అసిఫ్: షాకైన క్రికెటర్లు, ప్రేక్షకులు

Siva Kodati |  
Published : Aug 27, 2020, 03:26 PM IST
ఔటయ్యావు వెళ్లన్న కీమో పాల్... బ్యాట్‌తో కొట్టబోయిన అసిఫ్: షాకైన క్రికెటర్లు, ప్రేక్షకులు

సారాంశం

కరేబియన్ ప్రీమియర్ లీగ్‌ (సీసీఎల్ 2020) సందర్భంగా పాక్ క్రికెటర్ అసిఫ్ అలీ, విండీస్ క్రికెటర్ కీమో పాల్‌ల మధ్య పెద్ద గొడవ జరిగింది

కరేబియన్ ప్రీమియర్ లీగ్‌ (సీసీఎల్ 2020) సందర్భంగా పాక్ క్రికెటర్ అసిఫ్ అలీ, విండీస్ క్రికెటర్ కీమో పాల్‌ల మధ్య పెద్ద గొడవ జరిగింది. వివరాల్లోకి వెళితే.. లీగ్‌లో భాగంగా జమైకా తలైవాస్, గుయానా అమెజాన్ వారియర్స్ మధ్య బుధవారం క్వీన్స్‌పార్క్ ఓవల్ వేదికగా మ్యాచ్ జరిగింది.

దీనిలో భాగంగా బ్యాటింగ్ చేస్తున్న పాకిస్తాన్ క్రికెటర్ అసిఫ్ అలీ 3 పరుగులకే ఔటయ్యాడు. కరేబియన్ లీగ్‌‌లో మంచి ప్రదర్శన కనబరుస్తున్న అసిఫ్ అలీ.. ఈ మ్యాచ్‌లో భారీ షాట్ ఆడబోయి డీప్ మిడ్ వికెట్ వద్ద క్రిస్ గ్రీన్‌కు చిక్కాడు.

అయితే అప్పటికే పరుగు కోసం సగం క్రీజులోకి పరిగెత్తుకొచ్చిన అసిఫ్ అలీని ఉద్దేశించి కీమోపాల్ దురుసుగా ప్రవర్తించాడు. ‘‘ అసిఫ్ నువ్వు ఔటయ్యావు.. క్రీజు వదిలి వెళ్లు’’ అంటూ సైగ చేశాడు.

అప్పటికే ఔట్ అయ్యాననే అసహనంతో ఉన్న అసిఫ్ కీమో పాల్ వైపు బ్యాట్ ఎత్తాడు. అయితే అసిఫ్ బ్యాట్ నుంచి తృటిలో తప్పించుకున్న కీమో.. ఊహించని పరిణామానికి ఒక్కసారిగా షాకయ్యాడు.

మరోవైపు కీమో పాల్ కోపంతో అసిఫ్ వైపు జరిగినా అప్పటికే అతను వెళ్లిపోయాడు. ఈ మ్యాచ్‌లో జమైకా జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే అసిఫ్ చేసిన పనికి మాత్రం రిఫరీలు సీరియస్ అయ్యారు. 
 

PREV
click me!

Recommended Stories

5 Wickets in 1 Over : W, W, W, W, W... ఒకే ఓవర్‌లో 5 వికెట్లు.. అంతర్జాతీయ క్రికెట్ కొత్త చరిత్ర
Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !