‘ మాస్క్ పోడు’ .. కరోనాపై హర్భజన్ తమిళ స్పీచ్, సోషల్ మీడియాలో వైరల్

By Siva KodatiFirst Published Aug 26, 2020, 4:42 PM IST
Highlights

కరోనా వైరస్ పంజా విసిరిన నాటి నుంచి ప్రముఖులు, సెలబ్రిటీలు ప్రజలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ తమ ధర్మం నిర్వర్తిస్తున్నారు. 

కరోనా వైరస్ పంజా విసిరిన నాటి నుంచి ప్రముఖులు, సెలబ్రిటీలు ప్రజలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ తమ ధర్మం నిర్వర్తిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు వార్తలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు, మాజీ టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా అభిమానులకు కరోనాపై పలు సూచనలు చేశాడు. మాస్కు తప్పనిసరిగా ధరించాలని, అవసరమైతేనే బయటకు తిరగాలని ఆయన చెన్నై అభిమానులను కోరాడు.

అనవసరంగా బహిరంగ ప్రదేశాల్లో తిరగొద్దని విజ్ఞప్తి చేశాడు. దీని కోసం అతను తమిళంలోనే మాట్లాడిన వీడియో  సందేశాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. కాగా, 2018లో చెన్నై జట్టులో చేరిన హార్భజన్ మెరుగైన ప్రదర్శనతో ధోనీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.

చెన్నై తరపున ఇప్పటి వరకు 24 మ్యాచ్‌లు ఆడిన భజ్జీ 23 వికెట్లు తీశాడు. ఐపీఎల్ మొత్తం 160 మ్యాచ్‌లాడిన ఈ వెటరన్ స్పిన్నర్ 7.05 సగటుతో 150 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.

మరోవైపు యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. యూఏఈ పిచ్‌లు స్పిన్నర్లకు సహకరిస్తాయనే కథనాలు వెలువడుతున్నాయి.

ఇప్పటికే చెన్నై జట్టులో కీలకమైన ఆటగాడిగా ఎదిగిన హర్భజన్‌కు ఐపీఎల్ 2020 మరింతగా కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయని అభిమానులు సంబరపడుతున్నారు.

 

"Vanakkam Chennai. Step out of your home only if absolutely necessary. Mask podu!" with the need-of-the-hour message. 🦁💛 pic.twitter.com/zL6kin2y4C

— Chennai Super Kings (@ChennaiIPL)

 

click me!