పాక్ క్రికెటర్ షహజాద్ తొండాట... రివ్యూ కోరి మరీ అభాసుపాలు

By Arun Kumar PFirst Published Apr 5, 2019, 6:48 PM IST
Highlights

క్రికెట్లో రాణించాలంటే కేవలం కఠోర శిక్షణే కాదు క్రమ శిక్షణ, నిజాయితీ కూడా చాలా ముఖ్యం. అలా నిజాయితీగా వున్న ఆటగాళ్లు ఎక్కువకాలం క్రికెట్ కెరీర్ కొనసాగిస్తుంటారు. అలాకాకుండా వివాదాలతో, దుందుడుకు స్వభావంతో, తొండాటలతో కొందరు ఆటగాళ్లు తమ జట్టును గెలిపించుకోవడాని ప్రయత్నిస్తుంటారు. ఇది అప్పటిపూర్తికి అతడిని హీరోను చేసి ఆనందాన్నివ్వొచ్చు కానీ అతడి కెరీర్ కు అదో మచ్చలా మిగిలిపోతుంది. ఇలా ఓ పాకిస్థానీ క్రికెటర్ తొండాటకు ప్రయత్నించి కెమెరాకు చిక్కి సొంత అభిమానుల నుండే విమర్శలను ఎదుర్కొంటున్నాడు. 

మన దాయాది దేశమైన పాకిస్థాన్ జట్టు ఆటగాడు అహ్మద్ షహజాద్ పాకిస్తాన్ కప్ టోర్నీలో ఆడుతున్నాడు. స్థానిక లిస్ట్ ఎ క్రికెట్ జట్ల మధ్య జరిగే వన్డే టోర్నీలో అతడు ఫెడరల్ ఏరియా జట్టు సభ్యునిగా బరిలోకి దిగాడు. ఈ క్రమంలో ఖైబర్ పఖ్తుంఖ్వా జట్టుతో జరిగిన మ్యాచ్ లో షహజాద్ క్రీడా స్పూర్తిని మరిచి తొండి చేయాలని ప్రయత్నించాడు. 

ఈటోర్నీలో భాగంగా మొదట బ్యాటింగ్ చేపట్టిన ఫెడరల్ ఏరియా జట్టు నిర్ణీత ఓవర్లలో 270 పరుగులు చేసింది. 271 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పఖ్తుంఖ్వా జట్టు 49.2 ఓవర్లలో 298 పరుగుల వద్ద నిలిచింది. ఆ జట్టు గెలుపుకు 4 బంతుల్లో 3 పరుగులు అవసరమున్న సమయంలో బ్యాట్ మెన్ ఖుష్‌దిల్ షా భారీ షాట్‌కు యత్నించాడు. అదికాస్తా గాల్లోకి లేచి బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న షెహజాద్‌ వద్దకు వెళ్లింది. అయితే ఈ క్యాచ్ అందుకునే ప్రయత్నంలో విఫలమైన అతడు బంతిని జారవిడిచాడు.

అలా కిందపడిన బంతిని తిరిగి చేతిలోకి తీసుకుని క్యాచ్ అందుకున్నట్టు నటించాడు. అంపైర్లు నాటౌట్‌గా ప్రకటించినప్పటికి థర్డ్ అంపైర్ కు రివ్యూ కోరాడు. కిందపడిన బంతిని తీరిగి చేతుల్లోకి తీసుకున్నట్టు రివ్యూలో స్పష్టంగా కనబడటంతో థర్డ్ అంపైర్ కూడా నాటౌట్ గా ప్రకటించాడు.. 

అయితే ఇలా కీలక సమయంలో జట్టు విజయం కోసం క్రీడాస్పూర్తిని మరిచిన షహజాద్ పై పాక్ అభిమానులు విరుచుకుపడుతున్నారు. అతడు నిజాయితీగా వ్యవహరిస్తే జట్టు ఓడినా అతడు హీరో అయ్యేవాడని...ఇప్పుడు అభిమానుల దృష్టిలో విలన్ అయ్యాడని అంటున్నారు. షహజాద్ క్యాచ్ జారవిడిచిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

click me!