వరుసగా రెండో ఓటమి: ఢిల్లీ దారుణస్థితికి కారణం అదేనన్న అయ్యర్

Siva Kodati |  
Published : Apr 05, 2019, 12:07 PM ISTUpdated : Apr 05, 2019, 12:11 PM IST
వరుసగా రెండో ఓటమి: ఢిల్లీ దారుణస్థితికి కారణం అదేనన్న అయ్యర్

సారాంశం

సునాయాసంగా గెలవాల్సిన రెండు మ్యాచ్‌లను చేజేతులా ఓడిపోవడం పట్ల ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆవేదన వ్యక్తం చేశాడు

సునాయాసంగా గెలవాల్సిన రెండు మ్యాచ్‌లను చేజేతులా ఓడిపోవడం పట్ల ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆవేదన వ్యక్తం చేశాడు. గురువారం ఢిల్లీలో మ్యాచ్‌లో ఢిల్లీ కాపిటల్స్‌ను సన్‌రైజర్స్ 5 వికెట్ల తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే.

ముందుగా బౌలింగ్ చేయడం వల్ల వికెట్‌ను ప్రత్యర్థి ఆటగాళ్లు పూర్తిగా అర్థం చేసుకోగలిగారు. బ్యాటింగ్‌లో వైఫల్యమే ఢిల్లీ ఓటమికి ప్రధాన కారణమని అయ్యారు అభిప్రాయపడ్డాడు. కనీసం 150 పరుగులైనా చేసి ఉంటే కాస్తైనా పోరాడే వాళ్లమన్నాడు.

టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైందని, తనకు ఒక్కరైనా సపోర్టుగా నిలిచి ఉంటే ఫలితం వేరోలా ఉండేదని.. రానున్న రోజుల్లో స్థాయిగా తగ్గట్టుగా ఆడతామని శ్రేయస్ అయ్యార్ స్పష్టం చేశాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ మాత్రమే ఇప్పటి వరకు ఫైనల్‌కు వెళ్లలేదు. అయితే కొత్త జెర్సీ.. జట్టు పేరు మార్పుతో ఎంట్రీ ఇచ్చింది ఆ జట్టు. అయితే ఫలితాలు మాత్రం మారడం లేదు. 

PREV
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?