బ్యాట్‌ను తిరగేసి పట్టుకుని పరుగు పూర్తి: చివరికి రనౌట్‌కే బలి, వీడియో వైరల్

By Siva KodatiFirst Published Feb 24, 2020, 9:43 PM IST
Highlights

పరుగు కోసం ప్రయత్నించేటప్పుడు రనౌట్ అయ్యే ప్రమాదం ఎదురైతే బ్యాట్స్‌మెన్లు ఇంకా వేగంగా పరిగెత్తుతారు. లేదంటే డ్రైవ్, ఇంకొందరైతే బ్యాటును నేలకు రాస్తూ క్రీజులోకి వస్తారు. అయితే పాకిస్తాన్ క్రికెటర్ ఆజామ్ ఖాన్ ఇందుకు భిన్నంగా పరుగును పూర్తి చేశాడు.

క్రికెట్ ఆడుతుండగా గ్రౌండ్‌లో క్రికెటర్లు కొన్ని విచిత్రమైన విన్యాసాలు చేస్తూ ఉంటారు. అవి సోషల్ మీడియాలో, అభిమానుల నోళ్లలో బాగా నానుతూ ఉంటాయి. ఇక అసలు మ్యాటర్‌లోకి వెళితే.. పరుగు కోసం ప్రయత్నించేటప్పుడు రనౌట్ అయ్యే ప్రమాదం ఎదురైతే బ్యాట్స్‌మెన్లు ఇంకా వేగంగా పరిగెత్తుతారు. లేదంటే డ్రైవ్, ఇంకొందరైతే బ్యాటును నేలకు రాస్తూ క్రీజులోకి వస్తారు.

అయితే పాకిస్తాన్ క్రికెటర్ ఆజామ్ ఖాన్ ఇందుకు భిన్నంగా పరుగును పూర్తి చేశాడు. పాకిస్తాన్ సూపర్‌లీగ్‌లో భాగంగా క్వెట్టా గ్లేడియేటర్స్‌ తరపున ఆజామ్ ఖాన్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా ఆడాడు.

Also Read:మోడీపై విషం కక్కిన పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదీ

ఓ బంతిని ఆడిన అతను పరుగు కోసం పరిగెడుతుండగా రనౌట్ అయ్యే ప్రమాదం వచ్చింది. క్రీజుకు కొంచెం దూరంలో ఉన్న ఆజామ్ రనౌట్ అవ్వకుండా ఉండాలని భావించి.. కంగారులో బ్యాటును తిప్పి పట్టుకున్నాడు. బ్యాటు హ్యాండిల్‌ను ముందు పెట్టి క్రీజులోకి అడుగుపెట్టాడు.

ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి నెటిజన్లు సైతం విచిత్రంగా కామెంట్లు పెడుతున్నారు. ఆజామ్ ఖాన్ క్రికెట్‌ను తిరగరాస్తున్నాడని.. ఆధునిక సమస్యలకు ఆధునిక పరిష్కారాలే అవసరం అంటూ స్పందిస్తున్నారు.

Also Read:మళ్లీ తిప్పేసిన పూనమ్: బంగ్లాదేశ్ పై ఇండియా మహిళల గెలుపు

కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ కింగ్స్ 156 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన క్వెట్టా విజయానికి 71 బంతుల్లో 102 పరుగులు అవసరమైనప్పుడు ఆజామ్ క్రీజులోకి వచ్చాడు.

30 బంతుల్లో 46 పరుగులు చేసి సర్ఫరాజ్‌ఖాన్‌‌ ఖాన్‌తో విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రనౌట్‌ నుంచి తప్పించుకునేందుకు ఆజామ్ ఇంత చేస్తే... చివరికి రనౌట్‌కు ఔటవ్వాల్సి వచ్చింది. అయితే మరో ఓవర్ మిగిలుండగానే క్వెట్టా గ్రేడియేటర్స్ విజయం సాధించింది.

click me!