ముస్లిం కాబట్టే షమీపై ట్రోల్స్... మండిపడ్డ ఓవైసీ..!

By telugu news teamFirst Published Oct 26, 2021, 11:25 AM IST
Highlights

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో షమీని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. షమీ పై, ఇన్‌స్టా గ్రామ్‌లో షమీ పోస్టులపై అసభ్యకరంగా కామెంట్స్‌ పెడుతున్నారు.

T20 worldcup లో భాగంగా  ఆదివారం భారత్- పాక్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ మ్యాచ్ లో  చివరకు విజయం పాకిస్తాన్ కే దక్కింది. ఇప్పటి వరకు వరల్డ్ కప్ లో.. భారత్ పై పాక్ గెలిచిందే లేదు. అలాంటిది ఈ సారి భారత్ పై అఖండ విజయం సాధించింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో.. భారత్ మ్యాచ్ ఓడిపోవడానికి టీమిండియా క్రికెటర్ షమీనే కారణమంటూ అందరూ మండిపడ్డారు.

పాక్ పై ఓటమిని భారత్ అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో షమీని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. షమీ పై, ఇన్‌స్టా గ్రామ్‌లో షమీ పోస్టులపై అసభ్యకరంగా కామెంట్స్‌ పెడుతున్నారు.

ఇండియా టీంలో ఓ పాకిస్థానీ ఉన్నాడని, పాక్‌ నుంచి ఎన్ని డబ్బులు తీసుకున్నాడో చెప్పాలని, ఇక రిటైర్మెంట్‌ తీసుకో. పాకిస్తాన్‌ వెళ్లిపో బొసిడికే అంటూ నెటిజన్లు ట్రోల్స్‌ చేస్తున్నారు. కాగా షమీ నిన్నటి మ్యాచ్‌లో 3.5 ఓవర్లలో 43 రన్స్ ఇచ్చాడు. మ్యాచ్‌ ఓడిపోవడానికి ఈ రన్స్ కారణమంటూ షమీ పై నెటిజన్లు తమదైనా రీతిలో ట్రోల్స్‌ చేస్తున్నారు.

కాగా.. షమీపై చేస్తున్న ట్రోల్స్ పై ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు.  షమీపై ట్రోల్స్ ని అసదుద్దీన్ ఖండించాడు. భారత్ లో మతవాదం పెరిగిపోతోందని.. అందుకు ఇదే నిదర్శనమని ఆయన పేర్కొనడం గమనార్హం.

టీమిండియాలో 11మంది సభ్యులు ఉన్నారని.. అయినా.. కేవలం ముస్లిం వ్యక్తిని మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకొని ట్రోల్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. క్రికెటర్ షమీపై ట్రోల్ చేస్తున్నవారిని బీజేపీ ప్రభుత్వం సమర్థిస్తోందా అని ఆయన ప్రశ్నించారు.

కాగా.. ఈ మ్యాచ్ జరగక ముందు కూడా అసదుద్దీన్ స్పందించారు. అసలు భారత్-పాక్ మ్యాచ్ జరగొద్దని ఆయన కోరారు. క‌శ్మీర్‌లో ఇటీవ‌ల‌ జ‌రిగిన ఉగ్ర‌వాద దాడుల్లో తొమ్మిది మంది భార‌త జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయార‌ని ఆయ‌న చెప్పారు.ఓ వైపు పాక్ ప్రోత్సాహంతో చెల‌రేగిపోతోన్న ఉగ్ర‌వాదం వ‌ల్ల మ‌న సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే, మ‌రోవైపు టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో పాకిస్థాన్‌తో భార‌త్‌ మ్యాచ్ ఆడుతుంద‌ని ఆయ‌న అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు. క‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదాన్ని అణిచివేయ‌డంలో కేంద్ర స‌ర్కారు విఫ‌ల‌మైంద‌ని అన్నారు.

Also Read: T20 worldcup 2021: ఆఫ్ఘాన్ చేతుల్లో చిత్తుగా ఓడిన స్కాట్లాండ్... 60 పరుగులకే ఆలౌట్...

దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు, లడఖ్‌లో మన భూభాగాన్ని చైనా ఆక్రమించుకున్న విషయం గురించి ప్రధాని మోదీ అస్సలు మాట్లాడటం లేదని ఆరోపించారు. ‘‘ప్రధాని మోదీ రెండు అంశాల గురించి అస్సలు మాట్లాడటం లేదు.. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, లడఖ్‌లోని మన భూభాగంలో చైనా తిష్టవేసినా నోరువిప్పడం లేదు’ అని ఒవైసీ ధ్వజమెత్తారు.

‘చైనా గురించి మాట్లాడటానికి ప్రధాని భయపడుతున్నారు’ అంటూ విమర్శించారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డుస్థాయిలో పెరుగుతున్న విషయం తెలిసిందే. లీటర్ పెట్రోల్ పలు నగరాల్లో రూ.110 దాటిపోయింది. ఈ నేపథ్యంలో ఒవైసీ విమర్శలు గుప్పించారు. అలాగే, జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడుతూ పలు ఎదురుకాల్పుల్లో సైనికులు మరణాలపై కూడా ఒవైసీ స్పందించారు.

‘జమ్మూ కశ్మీర్‌లో మన సైనికులు తొమ్మిది మంది అమరులయ్యారు.. అలాంటప్పుడు అక్టోబరు 24న పాకిస్థాన్‌తో భారత్ టీ20 క్రికెట్ మ్యాచ్ అడటమా?’ అని ప్రశ్నించారు. ‘మన సైనికులు చనిపోతే.. మీరు టీ20 ఆడతారా? కశ్మీర్‌లోని భారత ప్రజల ప్రాణాలతో పాకిస్థాన్ రోజూ 20-20 ఆడుకుంటోంది’ అని ఒవైసీ మండిపడ్డారు. ఎవరు ఎంత వద్దు అన్నా.. మ్యాచ్ నిర్వహించారు.. చివరకు విజయం కూడా పాక్ కే దక్కడం గమనార్హం. 

click me!