WI vs IND: ఒక మ్యాచ్.. ముగ్గురు అర్ష్‌దీప్‌లు..! ఓపెనర్ అతడే, చివరి బ్యాటర్ కూడా అతడే..

Published : Aug 02, 2022, 12:08 PM IST
WI vs IND: ఒక మ్యాచ్.. ముగ్గురు అర్ష్‌దీప్‌లు..! ఓపెనర్ అతడే, చివరి బ్యాటర్ కూడా అతడే..

సారాంశం

WI vs IND T20I: విండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టు రెండో టీ20లో అనూహ్యకర ఓటమిని మూటగట్టుకుంది.  అయితే ఈ మ్యాచ్ లో టాపార్డర్ లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ తో పాటు  పదో నెంబర్ గా వచ్చిన అర్ష్‌దీప్ వరకూ..   

విండీస్ తో తొలి టీ20లో నెగ్గినా రెండో మ్యాచ్ లో భారత్ కు భంగపాటు  తప్పలేదు.  ఈ మ్యాచ్ లో భారత్ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. అయితే రెండో టీ20లో భారత జట్టు తరఫున ఒక వింత ఘటన చోటు చేసుకుంది. టీమిండియా ఓపెనర్ మొదలు,  11 నెంబర్ బ్యాటర్ వరకు ముగ్గురు అర్ష్‌దీప్ లు బ్యాటింగ్ కు రావడం విశేషం. అదేంటి జట్టులో ఉన్నది ఒకడే అర్ష్‌దీప్ కదా. అదీగాక ఒక బ్యాటర్ ను ఒకేసారి కదా క్రీజులోకి అనుమతించేది అనుకుంటున్నారు కదా.. అక్కడే ఉంది అసలు కిటుకు. 

రెండో టీ20 జరిగిన సెయింట్ కిట్స్ కు భారత లగేజీ రావడానికి ఆలస్యమైంది. అప్పటికే రెండు గంటలు వేచి చూసిన భారత ఆటగాళ్లు.. ఆ తర్వాత కూడా లగేజీ రాకపోవడంతో ఇతర ఆటగాళ్ల జెర్సీలు వేసుకుని బరిలోకి దిగారు. ఇలా వచ్చినవారిలో సూర్యకుమార్ యాదవ్ తో పాటు అవేశ్ ఖాన్ ఉన్నారు. 

సూర్యకుమార్ యాదవ్.. టీమిండియా ఓపెనర్ గా నిన్నటి మ్యాచ్ లో బరిలోకి దిగాడు. అతడి లగేజీ రాకపోవడంతో  సూర్య.. అర్ష్‌దీప్ జెర్సీ వేసుకున్నాడు.  అవేశ్ ఖాన్ దీ అదే  పరిస్థితి. ఇక అర్ష్‌దీప్ ఎలాగూ తన జెర్సీనే వేసుకోవడంతో నిన్నటి మ్యాచ్ లో ఈ ముగ్గురు ఆటగాళ్లను వెనుకనుంచి చూసినవారికి ఎవరు అసలైన అర్ష్‌దీప్ అని తేల్చుకోవడానికి కన్ఫ్యూజ్ అయ్యారు. వీళ్లే గాక మ్యాచ్ లో ఫీల్డింగ్  చేయడానికి వచ్చిన దీపక్ హుడా కూడా ప్రసిధ్ కృష్ణ జెర్సీ వేసుకున్నాడు. ఈ ఇద్దరూ అధికారికంగా నిన్నటి మ్యాచ్ లో భాగం కాకున్నా ఒకరి జెర్సీ మరొకరు వేసుకోవడం విశేషం. 

 

ఇక ఇదే విషయమై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.  విండీస్ క్రికెట్ బోర్డుపై ట్రోల్స్ తో మీమర్స్  ఫన్ ను  పంచుతున్నారు.  పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ‘ఓపెనర్ అర్ష్‌దీపే. చివరి బ్యాటర్ కూడా అతడే..’, ‘ప్రయోగాలు బాగానే ఉన్నాయి. కానీ అర్ష్‌దీప్ తో ఓపెనింగ్ చేయిస్తున్నారు. ఇది సరైందో కాదో మరి ఒకసారి చూసుకున్నారా..?’, ‘అర్ష్‌దీప్ జెర్సీకి ఇంత ప్రాముఖ్యత ఉన్నదని ఈ మ్యాచ్ చూసేదాకా తెలియలేదు’, ‘ముగ్గరు అర్ష్‌దీప్ లు ఈ మ్యాచ్ ఆడుతున్నారు. మరి అతడికి కనీసం ఒక్క ఓవర్ అయినా ఎక్కువివ్వరా..?’, ‘అర్ష్‌దీప్ జెర్సీ వేసుకున్న అవేశ్.. అతడిలాగే బౌలింగ్ చేస్తాడా..?’ అని  కామెంట్స్ చేస్తున్నారు. 

 

 

ఇక ఈ మ్యాచ్ లో భారత్.. తొలుత బ్యాటింగ్ చేసి  19.4 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌట్ అయింది. హార్ధిక్ పాండ్యా (31) టాప్ స్కోరర్.  విండీస్ పేసర్ ఒబెడ్ మెక్‌కాయ్ ఆరు వికెట్లతో చెలరేగాడు. అనంతరం వెస్టిండీస్ జట్టు..  19.2 ఓవర్లలో విజయాన్ని అందుకుంది. బ్రాండన్ కింగ్ (68) హాఫ్ సెంచరీతో రాణించాడు.  

PREV
click me!

Recommended Stories

IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది