NZ vs BAN : న్యూజిలాండ్ పై బంగ్లాదేశ్ సంచ‌ల‌న గెలుపు

By Mahesh Rajamoni  |  First Published Dec 23, 2023, 11:01 AM IST

New Zealand vs Bangladesh: వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారిగా న్యూజిలాండ్ గడ్డపై బంగ్లాదేశ్ న్యూజిలాండ్‌ను ఓడించింది. మూడో వన్డేలో న్యూజిలాండ్‌ను 31.4 ఓవర్లలో 98 పరుగులకే ఆలౌట్ చేసిన బంగ్లాదేశ్ 15.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 
 


New Zealand vs Bangladesh: న్యూజిలాండ్ పై బంగ్లాదేశ్ సంచ‌ల‌న విజ‌యం సాధించింది. న్యూజిలాండ్ గడ్డపై వరుసగా 18 ఓటముల తర్వాత ఎట్టకేలకు ఆతిథ్య జట్టుపై వన్డేల్లో బంగ్లాదేశ్ సూప‌ర్ విక్ట‌రీ కొట్టింది. సిరీస్ లోని చివరి వన్డేలో అద్భుత ప్రదర్శన చేసింది. ఇప్పటికే సిరీస్ ను సుస్థిరం చేసుకున్న ఆతిథ్య జట్టు బ్యాట్ తో షాకింగ్ ప్రదర్శన కనబరిచి కేవలం 98 పరుగులకే ఆలౌటవ్వడంతో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో సునాయాసంగా విజయం సాధించింది.

మొద‌ట బంగ్లా ఫీల్డింగ్ ఎంచుకున్న తర్వాత రచిన్ రవీంద్ర నాలుగో ఓవ‌ర్ లోనే ఔట్ అయ్యాడు. ఆ త‌ర్వాత  హెన్రీ నికోల్స్ 12 బంతుల్లో 1 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. తొలి పవర్ ప్లేలో బంగ్లా 27 పరుగులు మాత్రమే ఇచ్చి కీవీస్ పై మరింత ఒత్తిడిని పెంచగలిగింది. టామ్ లాథమ్, విల్ యంగ్ లు క్రీజ్ లో నిల‌దొక్కుకున్నార‌నుకునే టైమ్ లోనే గా, షోరిఫుల్ ఇస్లాం త‌న అద్భుత బౌలింగ్ తో లాథ‌మ్ ను బౌల్డ్ చేశాడు. తన తర్వాతి ఓవర్ లో విల్ యంగ్  ను ఔట్ చేశాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన బ్యాట్స్ మ‌న్ లో పెద్ద‌గా ఎవ‌రూ రాణించ‌లేక‌పోయారు. దీంతో న్యూజిలాండ్ 31.4 ఓవ‌ర్ల‌లో 98 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది.

Latest Videos

బంగ్లాదేశ్ బౌల‌ర్ల‌లో షారిఫుల్ ఇస్లాం, తాంజిమ్ హసన్ సాకిబ్, సౌమ్య సర్కార్ లు త‌లా మూడు వికెట్లు తీయ‌గా, ముస్తాఫిజుర్ ఒక వికెట్ తీశాడు. స్వ‌ల్ప ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన బంగ్లాదేశ్ ఒక వికెట్ కోల్పోయి 15.1 ఓవ‌ర్ల‌లో ల‌క్ష్యాన్ని ఛేదించింది. నజ్ముల్ హుస్సేన్ శాంటో 51*, అనముల్ హక్ 37 ప‌రుగుల‌తో రాణించారు.

కీవీస్ వికెట్ల పతనం: 16-1 ( రచిన్ రవీంద్ర , 3.6), 22-2 ( హెన్రీ నికోల్స్ , 7.2), 58-3 ( లాథమ్ , 16.3), 61-4 ( విల్ యంగ్ , 18.4), 63-5 ( చాప్‌మన్ , 20.2), 70- 6 ( టామ్ బ్లండెల్ , 22.1), 85-7 ( జోష్ క్లార్క్సన్ , 26.5), 86-8 ( మిల్నే , 28.6), 97-9 ( ఆదిత్య అశోక్ , 30.4), 98-10 ( విలియం ఒరూర్కే , 31.4)

బంగ్లాదేశ్ వికెట్ల‌ పతనం: 84-1 ( అనాముల్ హక్ , 12.6)

సంక్షిప్త స్కోర్లు: న్యూజిలాండ్ 31.4 ఓవర్లలో 98 (తాంజిమ్ హసన్ సకీబ్ 3/14, సౌమ్య సర్కార్ 3/18, షారిఫుల్ ఇస్లాం 3/22) బంగ్లాదేశ్ 15.1 ఓవర్లలో 99/1 (నజ్ముల్ శాంటో 51*, అనాముల్ హక్ 37). కీవీస్ పై బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

IND VS SA: భారత్ VS సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ షెడ్యూల్, తేదీ, టైమ్, జట్టు పూర్తి వివ‌రాలు ఇవిగో..

click me!