కెప్టెన్ కూల్ కి కోపం.. అంపైర్లతో ధోనీ వాదన

By telugu news teamFirst Published Sep 23, 2020, 7:26 AM IST
Highlights

అయితే కరన్‌ మాత్రం కదలకుండా అక్కడే నిలబడిపోయాడు. తన నిర్ణయంపై సందేహం వచ్చిన షంషుద్దీన్‌ మరో అంపైర్‌ వినీత్‌ కులకర్ణితో చర్చించి థర్డ్‌ అంపైర్‌గా నివేదించగా అది నాటౌట్‌గా తేలింది. 

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మిస్టర్ కూల్ అన్న విషయం అందరికీ తెలిసిందే. కాగా... అలాంటి ధోనీకి కోపం తెప్పించారు. మంగళవారం రాజస్థాన్ రాయల్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ మ్యాచ్ లో చెన్నై ఓటమిపాలయ్యింది.  అయితే.. ఈ మ్యాచ్ లో ధోనీ అంపైర్లతో వాదనకు దిగాడు.

దీపక్‌ చహర్‌ వేసిన రాయల్స్‌ ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ ఐదో బంతికి టామ్‌ కరన్‌ను అంపైర్‌ షంషుద్దీన్‌ అవుట్‌ (కీపర్‌ క్యాచ్‌)గా ప్రకటించాడు. అయితే కరన్‌ మాత్రం కదలకుండా అక్కడే నిలబడిపోయాడు. తన నిర్ణయంపై సందేహం వచ్చిన షంషుద్దీన్‌ మరో అంపైర్‌ వినీత్‌ కులకర్ణితో చర్చించి థర్డ్‌ అంపైర్‌గా నివేదించగా అది నాటౌట్‌గా తేలింది. 

బంతి కరన్‌ బ్యాట్‌కు తగలకపోగా... ధోని కూడా బంతి నేలను తాకిన తర్వాతే అందుకున్నాడు. అయితే ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దానిపై మళ్లీ చర్చ ఏమిటంటూ ధోని అసహనం వ్యక్తం చేశాడు. అంపైర్‌ తప్పు చేయడం వాస్తవమే అయినా... తమ నిర్ణయాన్ని పునస్సమీక్షించే అధికారం నిబంధనల ప్రకారం ఫీల్డ్‌ అంపైర్లకు ఉంది. సాధారణంగా ఇలాంటి విషయాల్లో అంచనా తప్పని ధోని.. ఈసారి మాత్రం బోల్తాపడటం గమనార్హం.
 

click me!