CSK vs RR: ఆఖర్లో రఫ్ఫాడించిన జోఫ్రా ఆర్చర్... మరోసారి జోస్యం...

Published : Sep 22, 2020, 09:46 PM IST
CSK vs RR: ఆఖర్లో రఫ్ఫాడించిన జోఫ్రా ఆర్చర్... మరోసారి జోస్యం...

సారాంశం

ఆఖరి ఓవర్‌లో 30 పరుగులు సమర్పించుకున్న ఇంగిడి... మొదటి మూడు బంతుల్లో 27 పరుగులు...

IPL 2020: జోఫ్రా ఆర్చర్ బాబా... ప్రపంచంలో ఏం జరిగినా ఆర్చర్ వేసిన పాత ట్వీట్లు తెరపైకి వస్తుంటాయి. చెన్నై సూపర్ కింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలబడిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో వరుసగా నాలుగు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు ఆర్చర్. ఇంగిడి వేసిన ఈ ఓవర్‌లో మొదటి రెండు బంతులను బౌండరీ అవతల పడేశాడు ఆర్చర్. ఆర్చర్ దూకుడికి వరుసగా రెండు నో బాల్స్ వేశాడు ఇంగిడి. ఆ రెండు బంతులను కూడా సిక్సర్లుగా మలిచాడు ఆర్చర్. ఆ తర్వాతి బంతి వైడ్... ఫ్రీ హిట్ కొనసాగినా... ఎట్టకేలకు ఇంగిడి ఆఖరి ఓవర్‌లో ఓ డాట్ బాల్ వేశాడు.

అయితే మొదటి మూడు బంతుల్లోనే 27 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత మూడు బంతుల్లో మూడు సింగిల్స్ రావడంతో చెత్త రికార్డు నుంచి బయటపడ్డాడు ఇంగిడి. 2015లోనే జోఫ్రా ఆర్చర్... 6666 అని వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. 20వ ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా దిండా, జోర్డాన్‌లతో కలిసి సంయుక్తంగా టాప్‌లో నిలిచాడు ఇంగిడి. చావ్లా ఒకే ఓవర్‌లో 28 పరుగులు ఇవ్వగా, ఇంగిడి 30 పరుగులు ఇచ్చాడు. చావ్లా, ఇంగిడి కలిసి 8 ఓవర్లలో 111 పరుగులు సమర్పించుకవడం విశేషం. 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !