T20 Worldcup: ధైర్యం తగ్గిపోయింది.. వరస ఓటమిలపై కెప్టెన్ కోహ్లీ..!

By telugu news teamFirst Published Nov 1, 2021, 9:58 AM IST
Highlights

 ఈ టీ20 టోర్నీ తర్వాత.. తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు కోహ్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ రెండు మ్యాచుల్లో వైఫల్యం చెందడంతో.. నిజంగానే కోహ్లీ కెప్టెన్సీ పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కోహ్లీ సరిగా న్యాయకత్వం వహించలేదని.. అందుకే జట్టు ఓటమిపాలైందనే విమర్శలు వ్యక్తమౌతున్నాయి.

t20 worldcup లో టీమిండియాకు ఊహించని షాకులు ఎదురయ్యాయి. ఈ సారి వరల్డ్ కప్ ఎలాగైనా టీమిండియా సాధిస్తుందని అభిమానులు ఆశపడ్డారు. కానీ.. కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవని పరిస్థితిలో పడిపోయింది. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచుల్లోనూ టీమిండియా ఓటమిపాలవ్వడం గమనార్హం. దాయాది దేశం పాక్ చేతిలో ఓటమినే అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అలాంటిది.. తాజాగా.. ఆదివారం జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలోనూ ఓటమిపాలైంది. దాదాపు 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది.
కాగా..ఈ రెండు ఓటమిలపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ఈ రెండో ఓటమిల తర్వాత.. తమ జట్టు ధైర్యాన్ని కోల్పోయిందని కోహ్లీ పేర్కొన్నాడు. తాము డిఫెండింగ్ చేయడానికి ఏమీ లేదని.. కానీ.. మ్యాచ్ ఓటమి తర్వాత తమలో ధైర్యం తగ్గిపోయిందని కోహ్లీ పేర్కొన్నాడు.

కాగా.. ఈ టీ20 టోర్నీ తర్వాత.. తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు కోహ్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ రెండు మ్యాచుల్లో వైఫల్యం చెందడంతో.. నిజంగానే కోహ్లీ కెప్టెన్సీ పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కోహ్లీ సరిగా న్యాయకత్వం వహించలేదని.. అందుకే జట్టు ఓటమిపాలైందనే విమర్శలు వ్యక్తమౌతున్నాయి.

అయితే.. తమ జట్టుపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారని కోహ్లీ పేర్కొన్నాడు. తాము దేశం తరపున ఆడుతున్నప్పుడు.. కచ్చితంగా విజయం సాధిస్తామని అభిమానులు ఆశలుపెట్టుకుంటారని కోహ్లీ పేర్కొన్నాడు. అయితే..అది తమపై ఒత్తిడి పెంచుతుందని కోహ్లీ అన్నారు. అయితే.. ఆ ఒత్తిడి తమపై ఎప్పుడూ ఉంటుందని.. దానిని తాము స్వీకరిస్తూనే ఉన్నామని.. టీమిండియా తరపున ఆడే ప్రతి ఒక్కరూ ఆ ఒత్తిడిని స్వీకరించాల్సిందేనని కోహ్లీ పేర్కొన్నాడు.  అయితే.. తాము జట్టుగా ఆడినప్పుడు ఆ ఒత్తిడిని అధిగమించగలమని.. కానీ.. ఈ టీ20 వరల్డ్ కప్ లో జరిగిన రెండు మ్యాచుల్లోనూ తాము అది చేయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశాడు.

బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ ఆశించిన మేర రాణించలేకపోయామని కెప్టెన్ విరాట్ కోహ్లీ విచారం వ్యక్తం చేశాడు.శాడు. మైదానంలో అడుగుపెట్టినపుడు న్యూజిలాండ్‌ ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్‌ చూస్తే వాళ్లు ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించారని కోహ్లీ చెప్పాడు. అయితే తమ పరిస్థితి అలా లేదని... అవకాశం దొరికిందనుకున్న ప్రతిసారీ వికెట్‌ కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశాడు. షాట్‌ ఆడదామా లేదా అన్న సందిగ్దంలో పడి భారీ మూల్యం చెల్లించుకున్నామన్నాడు. ఇండియా తరఫున ఆడుతున్నపుడు భారీ స్థాయిలో అంచనాలు ఉంటాయని.. ఎంతో మంది తమను చూస్తుంటారని వివరించాడు.

Also Read: 2007 వన్డే వరల్డ్‌కప్ పర్ఫామెన్స్‌ను రిపీట్ చేసిన భారత జట్టు... టీమిండియాపై ఐపీఎల్ ఎఫెక్ట్...

చాలా మంది తమకోసం మైదానానికి కూడా వస్తారని.. ఈ అంచనాలకు అనుగుణంగా ఇండియాకు ఆడుతున్న ప్రతీ ఆటగాడు తనను తాను మలచుకోవల్సి ఉంటుందని విరాట్ స్పష్టం చేశాడు. కానీ కీలకమైన రెండు మ్యాచ్‌లలో తామలా చేయలేకపోయామని విరాట్ కోహ్లీ బాధపడ్డాడు. అందుకే ఓడిపోయామని విచారం వ్యక్తం చేశాడు. అయితే సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతూ ఆశావాదంతో ఉండాలన్నాడు. ఒత్తిడిని జయించి.. ముందుకు వెళ్లి.. ఈ టోర్నమెంట్‌లో ఇంకా మెరుగ్గా ఆడాల్సి ఉందని కోహ్లి చెప్పుకొచ్చాడు. ఒత్తిడిని అధిగమించలేక ప్రత్యర్థి జట్టు ముందు తలొంచాల్సి వచ్చిందని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. ఇండియా ఇంకా స్కాట్లండ్, నమీబియా, ఆఫ్ఘనిస్తాన్ జట్లతో ఆడాల్సి ఉంది.  

click me!