ఆఫ్ఘాన్ మహిళా క్రికెట్‌పై బ్యాన్... మెన్స్‌తో మ్యాచ్ రద్దు చేసుకుంటామంటున్న ఆస్ట్రేలియా...

By Chinthakindhi RamuFirst Published Sep 9, 2021, 11:10 AM IST
Highlights

మహిళల క్రీడలపై నిషేధం విధించిన తాలిబన్ ప్రభుత్వం... మహిళలకు ఆడనివ్వకపోతే, పురుషులతో మ్యాచ్ రద్దు చేసుకుంటామని ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా...

ఆఫ్ఘాన్‌లో తాలబిన్ల ప్రభుత్వం, మహిళలు బహిరంగ క్రీడలు ఆడకూడదంటూ నిషేధం విధించింది. దీంతో ఆఫ్ఘాన్ వుమెన్స్ టీమ్ భవితవ్యం ప్రశ్నార్థకంలో పడింది. ఇప్పుడిప్పుడే క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న ఆఫ్ఘాన్‌పై ఈ నిర్ణయం తీవ్రంగా పడింది...

ఆఫ్ఘనిస్తాన్‌ మహిళా క్రికెట్ జట్టుపై వేటు వేయడంతో, పురుషుల ఆడాల్సిన టెస్టు మ్యాచ్‌ను రద్దు చేసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేసింది ఆస్ట్రేలియా జట్టు. నవంబర్ 27న ఆస్ట్రేలియా, ఆఫ్ఘానిస్తాన్ మధ్య టెస్టు మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఆఫ్ఘాన్‌లో ఏర్పాడిన తాలిబన్ ప్రభుత్వం, మహిళలపై కఠినమైన ఆంక్షలు విధిస్తూ... క్రికెట్ ఆడేందుకు కూడా స్వేచ్ఛ లేకుండా చేసింది...

ఇస్లాం మతాచారాల ప్రకారం మహిళల బురఖా లేకుండా బయటికి వెళ్లకూడదని, క్రికెట్ ఆడే సమయంలో వారి శరీరభాగాలు కనిపిస్తున్నాయంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. దీనిపై ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు స్పందించింది...

మహిళలకు ఆడే అవకాశం ఇవ్వనప్పుడు, ఆఫ్ఘాన్‌ పురుషులతో కూడా క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా లేమంటూ కామెంట్ చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా... తాలిబన్ల ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రికెట్‌ను ప్రోత్సాహిస్తామని, టోర్నీలు పెట్టుకునేందుకు అవసరమైన సాయం కూడా చేస్తామని ప్రకటించింది.

అయితే ఇది కేవలం పురుషుల క్రికెట్‌కి మాత్రమే పరిమితం కావడంపై క్రికెట్ ఆస్ట్రేలియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది...‘ఆటలో లింగభేదాలు చూడడం సరైనది కాదు. ఆట అందరికీ ఆటే. పురుషులకు సమానంగా మహిళలకు ఆడే స్వేచ్ఛ ఇవ్వాలి...

మహిళా క్రికెటర్లకు ఆడే అవకాశం ఇవ్వకుండా, ఆఫ్ఘాన్ పురుషులతో జరిగే టెస్టు మ్యాచ్ రద్దు చేయాల్సి ఉంటుంది...’ అంటూ ప్రకటించింది క్రికెట్ ఆస్ట్రేలియా... ఆస్ట్రేలియా జట్టు హెచ్చరికలను ఆఫ్ఘాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

click me!