
టీమిండియా సీనియర్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. క్రికెట్ కి సంబంధించిన ఎప్పటికప్పుడు.. ఆయన ట్వీట్స్ చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా టీమిండియా ఆటగాళ్ల ఆటపై ఆయన తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా.. చెబుతూనే ఉంటారు. ఇక... టీమిండియా విజయం సాధించినప్పుడు ఆయన ఆనందం మామూలుగా ఉండదు. అయితే.. ఏ ట్వీట్ చేసినా.. కొంచెం డిఫరెంట్ గా ఉండేలా చేయడం ఆయన టాలెంట్. తాజాగా.. ఆయన ఇన్ స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఇంగ్లాండ్ పై టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంపై సెహ్వాగ్ ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ ఉపయోగించి మరీ ఈ పోస్టు చేయడం విశేషం.
కేవలం టర్నింగ్ ట్రాక్ లపై మాత్రం టీమిండియా విజయం సాధిస్తుందంటూ కామెంట్ ఛేసిన వారందరికీ ఈ విజయమే సమాధానం అంటూ సెహ్వాగ్ పోస్టు చేశారు. దానిని మోదీ మీమ్ ని జత చేశారు.
మోదీ ఫోటో మీద ‘ మీరంతా ఏడ్వడం ఆపండి’ అంటూ రాసి ఉండటం గమనార్హం. కాగా.. ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 50ఏళ్ల నాటి రికార్డును టీమిండియా బ్రేక్ చేసింది.
ప్రత్యర్థి ఇంగ్లండ్ జట్టు పై ఏకంగా 157 పరుగుల తేడాతో సూపర్ విక్టరీని అందుకుంది భారత జట్టు. భారత బౌలర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు తట్టుకోలేకపోయారు.
దీంతో తో 210 పరుగులకే… రెండో ఇన్నింగ్స్ లో కుప్పకూలింది ఇంగ్లాండ్ జట్టు. ఉమేష్ యాదవ్ ధాటికి… ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ లు వరుసగా పెవిలియన్ కు దారి పట్టారు. ఓపెనర్ బర్న్స్ 50 పరుగులు, ఆసీస్ హమీద్ 63 పరుగులు మరియు కెప్టెన్ రూట్ 36 పరుగులు మినహా ఏ ఒక్క ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ రాణించలేకపోయారు.
దీంతో ఐదు టెస్టుల సిరీస్ లో టీమిండియా 2-1 తేడాతో ఆధిక్యంలోకి వచ్చింది. ఇక ఇండియా బౌలర్ల లో ఉమేష్ యాదవ్ 3, బుమ్ర 2, జడేజా 2, ఠాకూర్ 2 వికెట్లు తీసి జట్టును ఆదుకున్నారు.
రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ (127, 256 బంతుల్లో), కేఎల్ రాహుల్ (46), పుజారా (61), కోహ్లీ (44), పంత్ (50), శార్దూల్ ఠాకూర్ (60) ఆశించిన స్థాయిలో రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో వెనుకబడిన పరుగులను అధిగమించడంతో పాటు భారీ ఆధిక్యాన్ని సంపాదించుకోగలిగింది. తొలి, రెండో ఇన్నింగ్సులో శార్దూల్ ఠాకూర్ (57, 60) రాణించడంతో భారత్ విజయం సులభతరమైంది.