న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా: శివమ్ దూబే చెత్త రికార్డు

By telugu teamFirst Published Feb 3, 2020, 1:44 PM IST
Highlights

న్యూజిలాండ్ పై జరిగిన టీ20 చివరి పోరులో భారత యువ బౌలర్ శివమ్ దూబే చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఒక్క ఓవరులో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్లలో రెండో స్థానం ఆక్రమించాడు.

ముంబై: న్యూజిలాండ్ పై జరిగిన చివరి టీ20లో భారత యువ బౌలర్ శివమ్ దూబే చెత్త రికార్డును నెలకొల్పాడు. టీ20 మ్యాచుల్లో ఒక ఓవరులో అత్యధిక పరుగులు సమర్పించుకున్న రెండో బౌలర్ గా ఆ రికార్డును సొంతం చేసుకున్నాడు. కివీస్ పై జరిగిన చివరి టీ20లో ఏతను ఒక ఓవరులో ఏకంగా 34 పరుగులు ఇచ్చాడు. 

ఇంగ్లాండు పేసర్ స్టువర్ట్ బ్రాండ్ ఈ విషయంలో మొదటి స్థానంలో నిలిచాడు. అతను ఒక్క ఓవరులో 36 పరుగులు సమర్పించుకుని చెత్త రికార్డులో మొదటి స్థానంలో నిలిచాడు.

Also Read: రోహిత్ శర్మకు గాయం: కేఎల్ రాహుల్ స్పందన ఇదీ.

టీమ్ సీఫెర్ట్, రాస్ టైలర్ శివమ్ దూబే కలిసి శివమ్ దూబే బౌలింగును తుత్తునియలు చేశారు. న్యూజిలాండ్ పై జరిగిన మ్యాచులో శివమ్ దూబే పదో ఓవరులో 34 పరుగులు ధారపోశాడు. తొలి బంతిని స్టీఫెర్ట్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ కు తరలించాడు. నెమ్మదిగా వేసిన రెండో బంతికి కూడా అదే గతి పట్టించాడు. 

ఇన్ సైడ్ ఎడ్జ్ తీసుకున్న మూడో బంతి కీపర్ మీదుగా బౌండరీ దాటింది. నాలుగో బంతికి సింగిల్ తీసుకున్నాడు. దాంతో రాస్ టైలర్ స్ట్రయికింగ్ కు వచ్చాడు. శివమ్ దూబే వేసిన ఐదో బంతి నో బాల్ అయింది. దాన్ని రాస్ టైలర్ బౌండరీకి తరలించాడు ఆ తర్వాత దూబే వేసిన బంతి ఫ్రీహిట్ కావడంతో బలంగా కొట్టి ఆరు పరుగులు పిండుకున్నాడు. 

Also Read: విరాట్ కోహ్లీ రికార్డ్ ని బ్రేక్ చేసిన రోహిత్ శర్మ

ఆఖరి బంతిని డీప్ స్క్వేయర్ మీదుగా స్టేడియం దాటించాడు. దీంతో న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ దూబే వేసిన ఓవరులో 34 పరుగులు రాబట్టుకున్నారు. జట్టుకు సారథ్యం వహించిన కేఎల్ రాహుల్ దూబేకు బౌలింగ్ ఇవ్వలేదు.

click me!