విరాట్ కోహ్లీ రికార్డ్ ని బ్రేక్ చేసిన రోహిత్ శర్మ

By telugu teamFirst Published Feb 3, 2020, 11:51 AM IST
Highlights

కోహ్లీ రికార్డును బ్రేక్ చేసి రోహిత్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. టీ20ల్లో అత్యధికసార్లు 50, అంతకంటే ఎక్కు పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. 25సార్లు రోహిత్ 50, అంతకన్నా ఎక్కువ పరుగులు  చేయడం విశేషం.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ... రికార్డులను క్రియేట్ చేయడమైనా... అవతల వారి రికార్డులను బ్రేక్ చేయడంలోనైనా ఆయనకు ఆయనే సాటి. అందుకే విరాట్ ని పరుగుల మిషన్, పరుగుల రారాజు అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. అయితే... అలాంటి విరాట్ రికార్డుని ఇప్పుడు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్రేక్ చేశాడు. 

కోహ్లీ రికార్డును బ్రేక్ చేసి రోహిత్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. టీ20ల్లో అత్యధికసార్లు 50, అంతకంటే ఎక్కు పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. 25సార్లు రోహిత్ 50, అంతకన్నా ఎక్కువ పరుగులు  చేయడం విశేషం.

Also Read టీమిండియా క్లీన్ స్వీప్.... ఆనందంతో చిందులేసిన చాహల్, శ్రేయాస్..

గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. కాగా ఇప్పుడు అది రోహిత్ చెంతకు చేరింది.  న్యూజిలాండ్ తో ఆదివారం జరిగిన 5వ  టీ20లో రోహిత్ శర్మ 60 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ కు విశ్రాంతి తీసుకోవడంతో అతని పేరిట ఉన్న రికార్డును తన పేరిట లిఖించుకునే అవకాశం రోహిత్ శర్మకు దక్కింది.

ఇప్పటి వరకు 108 టీ20 మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ నాలుగు సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు చేశాడు.కోహ్లీ 24 హాఫ్  సెంచరీలు చేశాడు. అయితే కోహ్లీ ఇప్పటి వరకు 82 మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ మార్టిన్ గప్టిల్, ఐర్యాండ్ కు చెందిన పాల్ స్టిర్లింగ్ 17సార్లు హాఫ్ సెంచరీలు చేశాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ 16సార్లు ఈ ఫీట్ నమోదు చేశారు. పరుగుల పరంగా చూస్తే మాత్రం రోహిత్ కన్నా.. కోహ్లీనే ముందుండటం విశేషం. 

click me!