షమీ తడాఖా: ఎట్టకేలకు కివీస్ ను భయపెట్టిన భారత బౌలర్లు

By telugu teamFirst Published Mar 1, 2020, 9:53 AM IST
Highlights

ఎట్టకేలకు భారత బౌలర్లు న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ కు సవాల్ విసిరారు. భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక న్యూజిలాండ్ రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్సులో 235 పరుగులకే చాప చుట్టేసింది.

క్రైస్ట్ చర్చ్: న్యూజిలాండ్ పై జరుగుతున్న రెండో టెస్టు మ్యాచులో ఎట్టకేలకు న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ కు భారత బౌలర్లు సవాల్ విసిరారు. మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా న్యూజిలాండ్ బ్యాటింగ్ ను కట్టడి చేయగలిగారు. ఆదివారం రెండో రోజు టీ విరామ సమయానికి న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్సులో 235 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ 7 పరుగుల తొలి ఇన్నింగ్సు ఆధిక్యతను సంపాదించింది.

టామ్ లాథమ్ (52), జెమీషన్ (49) రాణించి న్యూజిలాండ్ స్కోరు పెంచారు. మిగతా బ్యాట్స్ మెన్ ఎవరు కూడా అంతగా రాణించలేదు.  153 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో జెమీసన్ భారత బౌలర్లపై దాడి చేసి 49 పరుగులు సాధించాడు. వాగ్నర్ (21) కూడా భారత బౌలర్లను శక్తిమేర ప్రతిఘటించాడు. 

తొలి రోజు ఆట కోసం క్లిక్ చేయండి: రెండో టెస్టు: మరోసారి చేతులెత్తేసిన భారత్, వికెట్ నష్టపోకుండా కివీస్

భారత బౌలర్లలో మొహమ్మద్ షమీకి 4 వికెట్లు, బుమ్రాకు 3 వికెట్లు దక్కాయి. రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీయగా, ఉమేష్ యాదవ్ 1 వికెట్ పడగొట్టాడు. భారత బౌలర్లు సమిష్టిగా రాణించడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్సులో ఎక్కువ పరుగులు చేయకుండా అడ్డుకోగలిగారు.

వికెట్ నష్టపోకుండా 63 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ భారత బౌలర్ల ధాటికి చతికిలపడింది. 177 పరుగులకే 8 కీలకమైన వికెట్లను కోల్పోయింది.  

click me!