భారత పర్యటనకు ముందే దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్... స్టార్ బౌలర్ జట్టుకు దూరం

By Arun Kumar PFirst Published Feb 29, 2020, 7:18 PM IST
Highlights

ఆస్ట్రేలియా జట్టులో కేప్ టౌన్ లో జరిగిన టీ20 మ్యాచ్ లో రబడ గాయపడ్డాడు. దీంతో  ప్రస్తుతం ఆసిస్ తో జరుగుతున్న సీరిస్ కే కాదు భారత పర్యటనకు కూడా అతడు దూరమయ్యాడు  

న్యూడిల్లీ:  భారత పర్యటనకు ముందే దక్షిణాఫ్రికా జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా పేసర్ కగిసో రబడ ఈ పర్యటనకు దూరమయ్యాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియాతో ప్రస్తుతం జరగుతున్న సీరిస్ కూడా అతడు దూరమయ్యాడు. 

ఆస్ట్రేలియా జట్టులో కేప్ టౌన్ లో జరిగిన టీ20 మ్యాచ్ లో రబడ గాయపడ్డాడు. అయితే గాయం తీవ్రత ఎక్కువగా వుండటంతో అతడికి నాలుగువారాల విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు. దీంతో ప్రస్తుతం ఆసిస్ తో జరుగుతున్న సీరిస్ కే కాదు భారత పర్యటనకు కూడా దూరమయ్యాడు  రబడ. 

రబడ దూరమవడంతో సఫారీ జట్టు బౌలింగ్ బలం తగ్గిందనే చెప్పాలి. ముందే భారత ఆటగాళ్లను స్వదేశంలో నిలువరించడం చాలా కష్టం. అలాంటిది పర్యటనకు ముందే బౌలింగ్ విభాగానికి వెన్నుముఖలాంటి  రబడ దూరమవడం సఫారీ జట్టుపై తీవ్ర ప్రభావం చూపనుంది. 

read more  డ్యాన్స్ టీచర్ అవతారమెత్తిన క్రికెటర్ జెమిమా... వీడియో వైరల్

ఇప్పటికే దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియా చేతితో 2-1 తేడాతో టీ20 సీరిస్ ను కోల్పోయింది. రబడ గాయం నుండి కోలుకుని వన్డే సీరిస్ లో సత్తా చాటుతాడని సఫారి అభిమానులు ఎదురుచూశారు. కానీ ఆ ఆశలు అడియాశలయ్యాయి. రబడ లేని లోటు ఈ  వన్డే సీరిస్ లోనే కాదు భారత పర్యటనకు వచ్చే జట్టులోని కనిపిస్తుంది. అతడి లోటును సఫారి జట్టు ఎలా పూడుస్తుందో చూడాలి. 

దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనలో మూడు వన్డేలు ఆడనుంది.  మార్చి 12వ తేదీ నుంచి మొదలయ్యే ఈ సీరిస్ 18వ తేదీ వరకు కొనసాగుతుంది. రబడాకు కనీసం నాలుగు వారాలు విశ్రాంతి అవసరం కాబట్టీ ఈ వన్డే సీరిస్ వరకు కోలుకునే అవకాశం లేదు. దీంతో ఈ సీరిస్ నుండి అతడు వైదొలిగాడు.  

read more  బంతితో రాధా యాదవ్, బ్యాట్ తో షెఫాలీ: శ్రీలంకపై ఘన విజయం

click me!