ఓ శకం ముగిసింది... సుదీర్ఘ కెరీర్‌కి ముగింపు పలికిన న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్...

Published : Apr 04, 2022, 12:20 PM IST
ఓ శకం ముగిసింది... సుదీర్ఘ కెరీర్‌కి ముగింపు పలికిన న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్...

సారాంశం

నెదర్లాండ్స్‌తో మూడో వన్డేతో అంతర్జాతీయ కెరీర్‌కి ముగింపు పలికిన న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్... 2006లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన రాస్ టేలర్.. 

న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్, అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్ సమయంలో రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించిన రాస్ టేలర్, నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే సిరీస్‌తో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేశాడు...

2006లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన రాస్ టేలర్, 2019 వన్డే వరల్డ్ కప్ సమయంలోనే రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత మరో రెండున్నరేళ్లు క్రికెట్‌లో కొనసాగిన రాస్ టేలర్, 2021 చివర్లోనే రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు.  స్వదేశంలో నెదర్లాండ్స్‌తో ఆడుతున్న మూడో వన్డే సిరీస్‌లో ఆఖరి వన్డే, రాస్ టేలర్‌కి ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్. ఆఖరి ఇన్నింగ్స్ ఆడేందుకు క్రీజులోకి వచ్చిన రాస్ టేలర్‌కి నెదర్లాండ్స్ ప్లేయర్లు, ‘గార్డ్ ఆఫ్ హానర్’తో స్వాగతం పలికారు...

ఆఖరి మ్యాచ్ ఆరంభానికి ముందు న్యూజిలాండ్‌ జాతీయ గీతం ఆలపిస్తూ ఎమోషనల్ అయ్యాడు రాస్ టేలర్. ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ కావడంతో రాస్ టేలర్ భార్య, పిల్లలు ఈ వన్డేకి హాజరయ్యారు. 16 బంతుల్లో ఓ సిక్సర్‌తో 14 పరుగులు చేసిన రాస్ టేలర్, వాన్ బ్రీక్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

న్యూజిలాండ్ తరుపున 112 టెస్టులు, 236 వన్డేలు, 102 టీ20 మ్యాచులు ఆడిన రాస్ టేలర్, మూడు ఫార్మాట్లలో 100+ మ్యాచులు ఆడిన మొట్టమొదటి కివీస్ క్రికెటర్‌గా నిలిచాడు. టెస్టుల్లో 19 సెంచరీలు, 3 డబుల్ సెంచరీలు చేసిన రాస్ టేలర్ 7684 పరుగులు చేశాడు...

వన్డేల్లో 21 సెంచరీలతో 86022 పరుగులు చేసిన రాస్ టేలర్, టీ20ల్లో 7 హాఫ్ సెంచరీలతో 1909 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో 55 మ్యాచులు ఆడిన రాస్ టేలర్ 1017 పరుగులు చేశాడు. 

నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది. మార్టిన్ గప్టిల్ 123 బంతుల్లో 11 ఫోర్లు,  2 సిక్సర్లతో 106 పరుగులు చేయగా విల్ యంగ్ 112 బంతుల్లో  6 ఫోర్లు, 4 సిక్సర్లతో 120 పరుగులు చేశాడు. కేన్ విలియంసన్, ట్రెంట్ బౌల్ట్, లూకీ ఫర్గూసన్ వంటి స్టార్ ప్లేయర్లు ఐపీఎల్ 2022 టోర్నీలో పాల్గొంటూ బిజీగా ఉండడంతో నెదర్లాండ్స్‌తో బీ టీమ్‌తో న్యూజిలాండ్...

మొదటి రెండు మ్యాచుల్లో పసికూన నెదర్లాండ్స్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్, క్లీన్ స్వీప్ దిశగా సాగుతోంది. మూడు ఫార్మాట్లలోనూ న్యూజిలాండ్‌కి సారథిగానూ వ్యవహరించిన రాస్ టేలర్, 2007 టీ20 వరల్డ్‌కప్, 2007 వన్డే వరల్డ్‌కప్‌తో పాటు 2011 వన్డే వరల్డ్‌కప్, 2015 వన్డే వరల్డ్‌కప్, 2019 వన్డే వరల్డ్‌ కప్ టోర్నీల్లోనూ ఆడాడు. 2007 నుంచి 2016 వరకూ అన్ని టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో న్యూజిలాండ్ తరుపున ఆడిన రాస్ టేలర్‌కి, 2021 టీ20 వరల్డ్‌ కప్ టోర్నీలో చోటు దక్కలేదు...

PREV
click me!

Recommended Stories

IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది