సిక్సర్‌తో చిన్నారికి గాయం... సెంచరీ సెలబ్రేట్ చేసుకోకుండా బ్యాట్ వదిలేసి..

Published : Jan 16, 2021, 06:46 AM IST
సిక్సర్‌తో చిన్నారికి గాయం... సెంచరీ సెలబ్రేట్ చేసుకోకుండా బ్యాట్ వదిలేసి..

సారాంశం

35 బంతుల్లో రికార్డు సెంచరీ బాదిన సోఫీ... సిక్సర్‌తో స్టేడియంలోని చిన్నారికి గాయం... బ్యాటు వదిలేసి వెళ్లి చిన్నారిని పరామర్శించిన వుమెన్ క్రికెటర్...

ఏ ఫార్మాట్ అయినా సెంచరీ చాలా స్పెషల్. అదీ సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసుకుంటే చాలా చాలా స్పెషల్. అయితే సిక్సర్ బాది సెంచరీ పూర్తి చేసుకున్న న్యూజిలాండ్ వుమెన్ క్రికెటర్ సోఫీ డెవిన్... శతకం పూర్తి అయ్యిందన్న సంతోషం కంటే తన వల్ల చిన్నారికి గాయమైందని కలవరపడింది.

వుమెన్స్ సూపర్ స్మాష్ టీ20 టోర్నీలో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ సోఫీ... 38 బంతుల్లో 108 పరుగులు చేసి అదరగొట్టింది. వెల్లింగ్టన్ బ్లేజ్ తరుపున ఆడిన సోఫీ... సెంచరీకి చేరుకునేందుకు ఓ భారీ సిక్సర్ బాదింది. అయితే ఆ బంతి స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న ఓ చిన్నారి ఫ్యాన్‌కి తగిలింది.

ఆ విషయాన్ని గమనించిన సోఫీ... బ్యాటు వదిలేసి ప్రేక్షకుల మధ్యలో వెళ్లి ఆ పాపను ఓదార్చి వచ్చింది. అలా కొట్టినందుకు సారీ చెప్పి, అందరి మనసులను గెలుచుకుంది. ఆ చిన్నారి ఫ్యాన్‌తో కలిసి ఫోటో కూడా దిగింది. 

 

PREV
click me!

Recommended Stories

Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
ఆ మ్యాచ్ తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చేద్దామనుకున్నా.. కానీ.! రోహిత్ సంచలన వ్యాఖ్యలు