సచిన్ ఎక్కడ ఆపాడో, అక్కడి నుంచే మొదలెట్టిన అర్జున్ టెండూల్కర్...

By team teluguFirst Published Jan 16, 2021, 5:40 AM IST
Highlights

హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో ఆరంగ్రేటం చేసిన అర్జున్ టెండూల్కర్...

మొదటి మ్యాచ్‌లో ఓ వికెట్ తీసిన అర్జున్...

8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన ముంబై జట్టు... సూర్యకుమార్ యాదవ్‌తో పాటు నలుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్

సచిన్ టెండూల్కర్... క్రికెట్ ఓ మతం అయితే దానికి దేవుడు సచిన్ టెండూల్కర్. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుని, టన్నుల కొద్ది పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ కొడుకు క్రికెట్ ఎంట్రీ ఇస్తున్నాడంటే అతనిపై ఏ రేంజ్‌లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే యాదృచ్ఛికమో లేక కావాలని ప్లాన్ ప్రకారం చేశారో తెలీదు కానీ సచిన్ టెండూల్కర్ దేశవాళీ క్రికెట్‌లో తన క్రికెట్ ప్రస్థానం ఎక్కడైతే ఆపాడో, అర్జున్ టెండూల్కర్ అక్కడి నుంచే తన కెరీర్ మొదలెట్టాడు. సచిన్ టెండూల్కర్ తన చివరి రంజీ మ్యాచ్‌ను ముంబై జట్టు తరుపున హార్యానాపై ఆడాడు. అర్జున్ టెండూల్కర్ తన మొదటి మ్యాచ్‌ను ముంబై తరుపున, హార్యానా ప్రత్యర్థిగానే ఆడడం విశేషం.

సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో హార్యానాతో జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టులో చోటు దక్కించుకున్న అర్జున్ టెండూల్కర్, 3 ఓవర్లు బౌలింగ్ చేసి 34 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు. అయితే ఈ మ్యాచ్‌లో హర్యానా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 19.3 ఓవర్లలో 143 పరుగులకి ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు శివమ్ దూబే, సర్ఫరాజ్ ఖాన్, మరో ముగ్గురు బ్యాట్స్‌మెన్ డకౌట్ అయ్యారు. 11వ బ్యాట్స్‌మెన్‌గా వచ్చిన అర్జున్ టెండూల్కర్ బంతులేమీ ఎదుర్కోలేదు. ఈ లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి తేలిగ్గా చేధించింది హర్యానా.

click me!