
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా కొత్త జెర్సీతో బరిలో దిగబోతోంది. టెస్టు ఫార్మాట్ కాబట్టి కొత్త రంగులు ఏమీ ఉండవు. తెల్ల రంగు జెర్సీయే ఇరు జట్ల ఆటగాళ్లు ధరించాలి. అయితే పైనల్ మ్యాచ్ కోసం ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ 2021 అని రాసి ఉన్న జెర్సీని రూపొందించింది ఐసీసీ.
1990ల్లో భారత జట్టు ధరించిన జెర్సీ లుక్‌లో ఉన్న ఫైనల్ మ్యాచ్ జెర్సీ లుక్‌ని భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రివీల్ చేశాడు. జెర్సీ వేసుకున్న ఫోటోను పోస్టు చేసిన రవీంద్ర జడేజా... ‘వీవైండ్ టు 90's... లవింగ్ ఇట్, ఇండియా’ అంటూ కాప్షన్ జత చేశాడు.
ఇంగ్లాండ్‌లోని సౌతింప్టన్ వేదికగా జూన్ 18 నుంచి న్యూజిలాండ్‌తో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడుతుంది టీమిండియా. ఈ మ్యాచ్ డ్రాగా ముగిస్తే, ఇరు జట్లను సంయుక్త విజేతగా ప్రకటిస్తామని తెలియచేసింది ఐసీసీ.