
ఐపీఎల్ 2021 సీజన్ ఫస్టాఫ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్. మొదటి ఏడు మ్యాచుల్లో ఒకే ఒక్క విజయం సాధించి, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. ఐపీఎల్ సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ క్యాంపులో జరిగిన ఓ ఫన్నీ సంఘటనను పోస్టు చేసింది ఆరెంజ్ ఆర్మీ.
కిచెన్‌లో డేవిడ్ వార్నర్, విజయ్ శంకర్, కేదార్ జాదవ్, కేన్ విలియంసన్ కలిసి పెసరట్లు వేశారు. డేవిడ్ వార్నర్ పెసరట్టు వేస్తున్న సమయంలో కేన్ మామ వెనకాల నుంచి చెఫ్ క్యాప్ పెట్టాడు. ఆ తర్వాత పెసరట్టు టెస్టు చేసిన కేన్ విలియంసన్, తన చేత్తో పెసరట్టు వేశాడు.
ఈ ఫన్నీ పోటీలో కేన్ విలియంసన్ గెలిచినట్టు ప్రకటించాడు చెఫ్. ఈ వీడియోకి ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను...’ అని కామెంట్ చేసిన డేవిడ్ వార్నర్, కేన్ విలియంసన్‌ని ట్యాగ్ చేశాడు. ఫస్టాఫ్‌లో పర్ఫామెన్స్ ఆధారంగా డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించిన సన్‌రైజర్స్ యాజమాన్యం, కేన్ విలియంసన్‌కి కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.