
న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్‌తో చివరి వరకూ సాగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత్ పైచేయి సాధించింది. చివరి బంతి వరకు నరాలకు తెంపే టెన్షన్‌తో ఈ మ్యాచ్ సాగింది. గతంలో ఓడిన మ్యాచ్‌కు రివేంజ్ తీర్చుకోవడమా? లేక మరోసారి పరాజయం పాలవ్వడమా? అనే ఆలోచనలు చివరి ఓవర్ వేస్తుండగా చాలా మందిలో వచ్చాయి. కానీ, చివరి బంతికి అశ్విన్ ఫోర్ బాది భారత్‌కు విజయాన్ని సాధించి పెట్టాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌ను గెలిపించిన వన్ మ్యాన్ ఎవరని అడిగితే మాత్రం నిస్సందేహంగా అది మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. కొన్నాళ్లు ఫామ్‌లో లేక అనేకుల నుంచి సలహాలు, సూచనలు, చీదరింపులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌తో మరోసారి క్రికెట్ ప్రియుల్లో ది బెస్ట్ ప్లేయర్‌గా స్థానాన్ని పదిలపరుచుకున్నారు.
అందుకే సోషల్ మీడియాలో పాకిస్తాన్ పై భారత్ విజయాన్ని ఎంతగా వేడుక చేసుకుంటున్నారో.. కోహ్లీ వన్ మ్యాన్ షోను కూడా అంతే ఎత్తిపడుతున్నారు. వాట్ ఎ గేమ్ అంటూ ట్విట్టర్‌లో ట్రెండ్ చేశారు. దీపావళికి ముందే కానుక ఇచ్చిందని టీమిండియాపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ఇక దీపావళి పండుగను నిశ్చింతగా జరుపుకోవచ్చని పేర్కొన్నారు. గత మ్యాచ్‌కు రివేంజ్ అదిరిందని ఇంకొందరు టీమిండియా ఆటను మెచ్చుకున్నారు. ఇదిలా ఉండగా.. విరాట్ కోహ్లీని మాత్రం ట్విట్టర్‌లో ఆకాశానికెత్తారు. కొందరైతే.. ఎమోషన్‌కు గురై ఏడుస్తున్న ఎమోజీలనూ పోస్టు చేశారు.
Also Read: పాక్‌పై విజయం : కన్నీటి పర్యంతమైన విరాట్ కోహ్లీ, భుజానికెత్తుకున్న రోహిత్
మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులు సాధించాడు. కోహ్లీ వీర బాదుడుతో భారత్ విజయతీరానికి చేరింది. అందుకే కోహ్లీని.. కింగ్ కోహ్లీ అంటూ అభిమానులు పిలుస్తున్నారు. ఎప్పుడూ మియందాద్ ఇన్నింగ్స్ పై కలవరపడేవారికి.. ఇది కింగ్ కోహ్లీ ఇన్నింగ్స్ అని చెప్పే సర్రియల్ మూమెంట్ అంటూ ట్వీట్లు చేశారు. కింగ్ కోహ్లీ అని చెప్పడానికి మించి మరే పదాలు చాలవు అని ట్వీట్ చేశారు. క్లాస్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అంటూ మరో యూజర్ ట్వీట్ చేశారు. కోహ్లీ ఎమోషన్ అయ్యాడని, ఆయన కంటిలో కన్నీళ్లు చూడలేకపోయాను అంటూ పేర్కొన్నారు.
చివరి పది బంతులు చూశా.. ఏం గేమ్ అదీ.. జస్ట్ కింగ్ కోహ్లీ అంటే.. అంటూ మరొకరు ట్వీట్ చేశారు. విరాట్ కోహ్లీ క్రియేట్ చేసిన ఎమోషన్ అంతా ఇంతా కాదూ అని ఇంకొకరు పోస్టు చేశారు. గ్రేట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటూ విరాట్ కోహ్లీపై పొగడ్తలు కురిపించారు.
Also Read: హిట్‌మ్యాన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. కిర్రాక్ ఫోటోతో ట్రిబ్యూట్ ఇచ్చిన ఐసీసీ
మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ కూడా ట్విట్టర్‌లో రియాక్ట్ కాకుండా ఉండలేకపోయాడు. విరాట్ కోహ్లీని ప్రశంసించకుండా నియంత్రించుకోలేకపోయాడు. వైడ్‌గా వెళ్తున్న ఆ బంతిని అలాగే వదిలిపెట్టిన్ కూల్ ప్లేయర్ అశ్విన్ అంటూ స్టార్ట్ చేసి.. విరాట్ కోహ్లీని పొగిడి ట్వీట్ చేశాడు. గ్రేట్‌నెస్ భౌతికరూపం విరాట్ కోహ్లీ అంటూ మెచ్చుకున్నాడు.