
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి నెదర్లాండ్స్ అర్హత సాధించింది. 2023 వన్డే వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ నుంచి శ్రీలంక ఇప్పటికే వరల్డ్ కప్‌కి అర్హత సాధించగా మరో జట్టుగా నెదర్లాండ్స్ నిలిచింది. జింబాబ్వేపై గెలిచిన స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించి... ప్రపంచ కప్‌కి క్వాలిఫై అయ్యింది నెదర్లాండ్స్...
తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 277 పరుగుల భారీ స్కోరు చేసింది. బ్రెండన్ మెక్‌ముల్లెన్ 110 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 106 పరుగులు చేసి సెంచరీ సాధించగా క్రిస్టోఫర్ మెక్‌బ్రైడ్ 38 బంతుల్లో 6 ఫోర్లతో 32 పరుగులు చేశాడు..
కెప్టెన్ బ్రెర్రింగ్టన్ 84 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 64 పరుగులు చేయగా థామస్ మాకిన్టోష్ 38 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. బస్ దే లీడే 10 ఓవర్లలో 52 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
ప్రపంచ కప్‌కి అర్హత సాధించాలంటే ఈ లక్ష్యాన్ని 44 ఓవర్లలో ఛేదించాల్సి రాగా, నెదర్లాండ్స్ 42.5 ఓవర్లలోనే టార్గెట్‌ని ఊదేసింది. విక్రమ్‌జిత్ సింగ్ 49 బంతుల్లో 6 ఫోర్లతో 40 పరుగులు చేయగా మ్యాక్స్ ఓ2డాడ్ 20, వెస్లీ బర్రెసీ 11, తేజా నిడదమురు 10, స్కాట్ ఎడ్వర్డ్స్ 25, సకీబ్ జుల్ఫీకర్ 33 పరుగులు చేశారు. బౌలింగ్‌లో 5 వికెట్లు తీసిన బజ్ దే లీడే 92 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 123 పరుగులు చేసి సెంచరీ సాధించాడు..
ఇంతకుముందు చివరిసారిగా 2011 వన్డే వరల్డ్ కప్‌లో ఆడింది నెదర్లాండ్స్. ఆ తర్వాత 2015, 2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీలకు నెదర్లాండ్స్ అర్హత సాధించలేకపోయింది. ఇండియాలో జరిగిన 2011 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా, విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
ఐసీసీ వరల్డ్ కప్ 2023 టోర్నీకి శ్రీలంక,నెదర్లాండ్స్ అర్హత సాధించడంతో పూర్తి షెడ్యూల్‌పై క్లారిటీ వచ్చేసింది.
అక్టోబర్ 6న నెదర్లాండ్స్, పాకిస్తాన్‌తో హైదరాబాద్‌లో మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత అదే స్టేడియంలో నెదర్లాండ్స్, న్యూజిలాండ్ మధ్య అక్టోబర్ 9న మ్యాచ్ జరుగుతుంది. అక్టోబర్ 17న సౌతాఫ్రికాతో మ్యాచ్ ఆడే నెదర్లాండ్స్, అక్టోబర్ 21న శ్రీలంకతో తలబడుతుంది.
అక్టోబర్ 25న ఆస్ట్రేలియాతో, అక్టోబర్ 28న బంగ్లాదేశ్‌తో, నవంబర్ 3న ఆఫ్ఘనిస్తాన్‌తో, నవంబర్ 8న ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లు ఆడే నెదర్లాండ్స్... నవంబర్ 11న టీమిండియాతో మ్యాచ్ ఆడుతుంది.
అక్టోబర్ 7న సౌతాఫ్రికాతో మొదటి వరల్డ్ కప్ మ్యాచ్ ఆడే శ్రీలంక, ఆ తర్వాత అక్టోబర్ 12న పాకిస్తాన్‌తో, అక్టోబర్ 16న ఆస్ట్రేలియాతో మ్యాచులు ఆడుతుంది. అక్టోబర్ 21న నెదర్లాండ్స్‌తో, అక్టోబర్ 26న ఇంగ్లాండ్‌తో, అక్టోబర్ 30న ఆఫ్ఘాన్‌తో మ్యాచులు ఆడి నవంబర్ 2న టీమిండియాతో మ్యాచ్ ఆడనుంది శ్రీలంక..
2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగిన ముంబై, వాంఖడే స్టేడియంలోనే ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ జరగబోతుండడం విశేషం. నవంబర్ 6న బంగ్లాదేశ్‌తో, నవంబర్ 9న న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లు ఆడుతుంది లంక..