ఐపీఎల్ వద్దు... సంజనతో కలిసి మాల్దీవ్స్‌లో హానీమూన్‌కి వెళ్లిపో... బుమ్రాకి సలహా...

Published : Mar 16, 2021, 03:15 PM IST
ఐపీఎల్ వద్దు... సంజనతో కలిసి మాల్దీవ్స్‌లో హానీమూన్‌కి వెళ్లిపో... బుమ్రాకి సలహా...

సారాంశం

 ‘కంగ్రాట్స్... ఏప్రిల్, మే నెలల్లో హనీమూన్‌కి మాల్దీవుల్లో అద్భుతంగా ఉంటుందని విన్నాం’ అంటూ బుమ్రాకి కామెంట్లతో విష్ చేసిన రాజస్థాన్ రాయల్స్...

మిగిలిన ఐపీఎల్ ఫ్రాంఛైజీలతో పోలిస్తే రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియా అకౌంట్ అడ్మిన్ చాలా చమత్కారంగా పోస్టులు చేస్తూ, మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. తాజాగా పెళ్లి చేసుకుని ఒక్కటైన బుమ్రా, సంజన గణేశన్‌ల పెళ్లి గురించి కూడా ఇలా ఫన్నీ కామెంట్‌తో శుభాకాంక్షలు తెలిపాడు రాజస్థాన్ రాయల్స్ ట్విట్టర్ అకౌంట్ అడ్మిన్...

ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 2021 సీజన్ ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌కి నెల రోజులు కూడా లేకముందే సంజనను పెళ్లి చేసుకున్న జస్ప్రిత్ బుమ్రా, హానీమూన్ కోసం ఏప్రిల్, మే నెలల్లో మాల్దీవులకు వెళ్లాలని సూచించింది రాజస్థాన్ రాయల్స్...

‘కంగ్రాట్స్... ఏప్రిల్, మే నెలల్లో మాల్దీవుల్లో హనీమూన్ అద్భుతంగా ఉంటుందని విన్నాం’ అంటూ ఆర్ఆర్ అడ్మిన్ పెట్టిన కామెంట్ హాట్ టాపిక్ అయ్యింది.

మనోడి సెటైరికల్ బాగోతం తెలిసినవాళ్లు, పరిహాసాన్ని ఎంజాయ్ చేస్తూ నవ్వి ఊరుకుంటే, ముంబై అభిమానులు మాత్రం మనోడిని తిడుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు...
 

PREV
click me!

Recommended Stories

Smriti Mandhana: ఔను.. నా పెళ్లి రద్దయింది.. స్మృతి మంధాన, పలాష్ ముచ్ఛల్ సంచలన పోస్టులు
IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు