టీమిండియా కొత్త స్పాన్సర్‌గా ఎమ్‌పీఎల్... అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ...

Published : Nov 17, 2020, 12:00 PM ISTUpdated : Nov 17, 2020, 12:03 PM IST
టీమిండియా కొత్త స్పాన్సర్‌గా ఎమ్‌పీఎల్... అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ...

సారాంశం

భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లతో పాటు అండర్-19 భారత జట్లకు కూడా కిట్లను సరాఫరా చేయనున్న ఎమ్‌పీఎల్.... మూడేళ్ల పాటు కొనసాగుతున్న అగ్రిమెంట్... ఆసీస్ పర్యటనలో కొత్త జెర్సీలో భారత జట్టు...

ఆసీస్ పర్యటనలో భారత జట్టు కొత్త జెర్సీలో మెరవనుంది. టీమిండియా కిట్ స్పాన్సర్‌గా మొబైల్ గేమింగ్ యాప్ ఎమ్‌పీఎల్‌ను అధికారికంగా ప్రకటించింది బీసీసీఐ. మూడేళ్ల పాటు కొనసాగే ఈ అగ్రిమెంట్‌లో భాగంగా భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లతో పాటు అండర్-19 భారత జట్లకు కూడా కిట్లను సరాఫరా చేయనుంది ఎమ్‌పీఎల్.

నవంబర్ 2020 నుంచి ప్రారంభమయ్యే ఈ ఒప్పందం డిసెంబర్ 2023తో ముగుస్తుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఆసీస్ పర్యటనలో కొత్త జెర్సీలో కనిపించబోతోంది భారత క్రికెట్ జట్టు. విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహారిస్తున్న ఎమ్‌పీఎల్‌, వంద కోట్లకి పైగా క్రికెట్ అభిమానులున్న భారత జట్టుకి జెర్సీ, కిట్లను స్పాన్సర్ చేయడం గర్వంగా ఉందని ప్రకటించింది.

టీమిండియా కిట్ స్పాన్సర్‌గా ఉన్న నైక్‌తో 14 ఏళ్లుగా కొనసాగిన ఒప్పందం... ఈ సెప్టెంబరు నెలతో ముగిసింది. 

PREV
click me!

Recommended Stories

Sophie Devine : 4, 4, 6, 6, 6, 6 అమ్మబాబోయ్ ఏం కొట్టుడు.. ఒక్క ఓవర్‌లో 32 రన్స్
IND vs NZ : కోహ్లీ, గిల్ విధ్వంసం.. కేఎల్ రాహుల్ మాస్ ఫినిషింగ్