MI: నామకరణ మహోత్సవం.. రెండు కొత్త జట్లకు పేర్లు పెట్టిన ముంబై ఇండియన్స్..

Published : Aug 10, 2022, 02:56 PM IST
MI: నామకరణ మహోత్సవం..  రెండు కొత్త జట్లకు పేర్లు పెట్టిన ముంబై ఇండియన్స్..

సారాంశం

Mumbai Indians: ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా నిలిచింది  ముంబై ఇండియన్స్. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ఈ జట్టు త్వరలో యూఏఈ, సౌతాఫ్రికా లీగ్స్ లో కూడా అడుగుపెట్టింది. 

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేశ్ అంబానీ నేతృత్వంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుగాంచింది ముంబై ఇండియన్స్. ఐపీఎల్ లో ఐదు సార్లు ట్రోఫీ నెగ్గిన ఆ జట్టు.. పేరుతో పాటు విలువ పరంగా కూడా అగ్రస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.  ఆ జట్టు ఐపీఎల్ తో పాటు మరో రెండు చోట్ల పెట్టుబడులు పెట్టింది. యూఏఈ క్రికెట్ లీగ్ తో పాటు  సౌతాఫ్రికా క్రికెట్ లీగ్ (సీఎస్ఏ టీ20 లీగ్) లో  ఫ్రాంచైజీలను కొనుగోలు చేసింది. 

తాజాగా ముంబై ఇండియన్స్ ఈ రెండు ఫ్రాంచైజీలకు పేర్లు పెట్టింది. ముంబై ఇండియన్స్ బ్రాండ్ ను అలాగే ఉంచుతూ యూఏఈ లో కొనుగోలు చేసిన ఫ్రాంచైజీకి  MI Emirates గా నామకరణం చేసింది. 

ఇక సౌతాఫ్రికాలో కేప్ టౌన్ ఫ్రాంచైజీని అంబానీ దక్కించుకున్నారు. కేప్ టౌన్ ఫ్రాంచైజీకి MI Cape Town అని పేరును పెట్టింది. ఈ రెండు పేర్లలో కామన్ గా ఉన్న బ్రాండ్ MI. 

 

ఫ్రాంచైజీల పేర్లతో పాటు అదే జెర్సీలను ఆటగాళ్లు ధరించనున్నారు. ముంబై ఇండియన్స్  జెర్సీ బ్లూ, గోల్డ్  లతో కలగలిసిన దుస్తులే యూఏఈ, సౌతాఫ్రికా క్రికెట్ లీగ్ లలో కనిపించనున్నారు. ఈ మేరకు  ముంబై ఇండియన్స్.. తన  అధికారిక ట్విటర్ ఖాతాలో   ఈ విషయాన్ని వెల్లడించింది. 

 

ఇదే విషయమై నీతా అంబానీ  స్పందిస్తూ.. ‘మా #Onefamilyకి  సరికొత్త  ఫ్రాంచైజీలు MI ఎమిరేట్స్' & 'MI కేప్ టౌన్'ను స్వాగతించడం  చాలా సంతోషాన్నిస్తున్నది. ఎంఐతో మాకు క్రికెట్ కు మించిన  అనుబంధముంది. ఇక మా తాజా ఫ్రాంచైజీలు ఒకే నైతికితను స్వీకరిస్తాయి. ఎంఐ స్థాయిని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్తాయని నేను కచ్చితంగా భావిస్తున్నా..’ అని ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. 

 

 

PREV
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !