PV Sindhu: పీవీ సింధూను కీర్తిస్తూ పోస్ట్.. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన వార్నర్ భార్య...

Published : Aug 10, 2022, 10:04 AM IST
PV Sindhu: పీవీ సింధూను కీర్తిస్తూ పోస్ట్.. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన వార్నర్ భార్య...

సారాంశం

Commonwealth Games 2022: రెండ్రోజుల క్రితం ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు  మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. 

కామన్వెల్త్ గేమ్స్-2022లో తనను మూడు దఫాలుగా ఊరిస్తున్న  స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నది తెలుగు తేజం పీవీ సింధూ.  మూడు రోజుల క్రితం జరిగిన కామన్వెల్త్ గేమ్స్  ఉమెన్స్ బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్స్ లో సింధు.. కెనడాకు చెందిన షట్లర్ మిచెల్ లీ పై విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.  తాజాగా సింధూపై  ఆస్ట్రేలియా ఓపెనర్,  గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కు సారథిగా వ్యవహరించిన డేవిడ్ వార్నర్ ప్రశంసలు కురిపించాడు.  

సింధు స్వర్ణం నెగ్గిన నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా  వార్నర్ స్పందిస్తూ.. ‘వెల్ డన్ సింధు.. గొప్ప ప్రదర్శన.  స్వర్ణంతో ముగించావు..’అని  పోస్ట్ పెట్టాడు. దీనికి  లక్షలాది మంది అభిమానులు లైక్, షేర్ కొట్టారు. 

అయితే  వార్నర్ భాయ్ పెట్టిన పోస్టుపై అతడి భార్య క్యాండీస్ వార్నర్ కూడా స్పందించింది. వార్నర్ పెట్టిన పోస్టుకు ఆమె ‘సో గుడ్’ అని  కామెంట్ పెట్టింది.  హైదరాబాద్ ఫ్రాంచైజీని వీడినా ఇక్కడి అభిమానులు ఇంకా వార్నర్ ను తమ సొంతమనిషిలాగే భావిస్తారు. దీంతో వార్నర్ ఏం పోస్ట్ పెట్టినా ఇక్కడి అభిమానులు ఇట్టే కనెక్ట్ అవుతారు. తాజాగా సింధూను కీర్తిస్తూ అతడు చేసిన పోస్ట్ కూడా వైరల్ అవుతున్నది.

 

ఏసియన్ పేయింట్స్  ప్రశంసలు.. 

కామన్వెల్త్ లో స్వర్ణం నెగ్గిన సింధుపై  ప్రముఖ సంస్థ Asianpaints ప్రశంసలు కురిపించింది.  ఆమె విజయంపై ఏసియన్ పేయింట్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో అమిత్ సైంగిల్ స్పందిస్తూ.. ‘మా కుటుంబం (సింధూ ఇటీవలే ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది) లోకి కొత్తగా చేరిన సింధు కామన్వెల్త్ లో స్వర్ణం సాధించినందుకు సంతోషంగా ఉంది.  ఫైనల్ లో ఆమె చాలా బాడి ఆడి బంగారు పతకం సాధించింది. సింధు గెలుపు మాకు గర్వకారణం. కామన్వెల్త్ లో ఇది ఆమెకు తొలి స్వర్ణం.  ఇది ఆమెకు చాలా ప్రత్యేకం..’ అని తెలిపాడు. 

 

PREV
click me!

Recommended Stories

IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది