ముఖేశ్ అంబానీ భార్యకు అరుదైన గౌరవం, ఆ పదిమందిలో నీతా ఒకరు

By Siva KodatiFirst Published Mar 12, 2020, 9:35 PM IST
Highlights

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ భర్తకు తగ్గ భార్య అనిపించుకుంటున్నారు. రిలయన్స్ ఫాండేషన్ తరపున సామాజిక కార్యక్రమాల్లోనూ చూసుకుంటూనే మరికొన్ని వ్యాపారాల్లో భర్తకు తోడుగా నిలుస్తున్నారు

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ భర్తకు తగ్గ భార్య అనిపించుకుంటున్నారు. రిలయన్స్ ఫాండేషన్ తరపున సామాజిక కార్యక్రమాల్లోనూ చూసుకుంటూనే మరికొన్ని వ్యాపారాల్లో భర్తకు తోడుగా నిలుస్తున్నారు.

క్రికెట్‌ అంటే ఇష్టపడే నీతా అంబానీ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి యజమానిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2020 సంవత్సరానికి క్రీడల్లో అత్యంత ప్రభావవంతమైన 10 మంది మహిళల జాబితాలో నీతా చోటు దక్కించుకున్నారు.

Also Read:తొలి భారతీయురాలిగా నీతా అంబానీకి అరుదైన గౌరవం

టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్, జిమ్నాస్ట్ సైమన్ బైల్స్ వంటి వారి సరసన ఆమె స్థానం దక్కించుకున్నారు. ప్రముఖ స్పోర్ట్స్ బిజినెస్ నెట్ వర్క్ సంస్థ ‘‘ఐస్పోర్ట్ కనెక్ట్’’ జాబితాను విడుదల చేసింది.

మొత్తం 25 మందితో కూడిన ఈ జాబితాలో అనుభవజ్ఞులైన తమ ప్యానెల్ సభ్యులు అందులో నుంచి 10 మంది ప్రభావశీలురైన 10 మందిని ఎంపిక చేసినట్లు ఐస్పోర్ట్ కనెక్ట్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఆ ప్యానెల్‌లో టెల్‌స్ట్రా గ్లోబల్ సేల్స్ హెడ్ అన్నా లాక్ వుడ్, వై స్పోర్ట్ మేనేజింగ్ పార్టనర్ హ్యాంకాక్, ఐసీసీ మీడియా హక్కుల విభాగం మాజీ హెడ్ ఆర్తి దబాస్, ఐస్పోర్ట్ కనెక్ట్ సీఈవో శ్రీ వర్మ ఉన్నారు.

Also Read:ముకేశ్ -నీతా పెద్దమనస్సు: అమరుల కుటుంబాల బాధ్యత మాదే

కాగా రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్‌గా ఉన్న నీతా అంబానీ భారత్‌తో పాటు విదేశాల్లోనూ పలు క్రీడా ప్రాజెక్టుల్లో భాగమయ్యారు. రిలయన్స్ బోర్డులో 2014 నుంచి భాగమయ్యారు. ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్‌లో నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. మరోవైపు ఈ జాబితాలో సానియా మీర్జా, మిథాలీ రాజ్ పేర్లు కూడా ఉన్నాయి. 

ఐస్పోర్ట్ కనెక్ట్‌ లిస్ట్ ఇదే:

* నీతా అంబానీ
* సైమన్ బైల్స్ (జిమ్నాస్ట్)
* మేగాన్ రాపినో (ఫుట్ బాలర్)
* సెరెనా విలియమ్స్ (టెన్నిస్)
* నావోమి ఒసాకా
* ఎల్లీ నార్మన్ ( ఫార్ములా వన్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ డైరెక్టర్)
* కాథీ ఏంజెల్ బెర్ట్ (కమీషనర్, డబ్ల్యూఎన్‌బీఏ)
* ఫత్మా సమౌరా (ఫిఫా సెక్రటరీ జనరల్)
* మేరీ డేవిస్ (సీఈవో స్పెషల్ ఒలింపిక్స్)
* క్లార్ కానర్ ( ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మహిళా క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్)

click me!