ముంబై చేతిలో చిత్తు: ఐపీఎల్‌లో ముగిసిన బెంగళూరు కథ

By Siva KodatiFirst Published Apr 16, 2019, 7:33 AM IST
Highlights

ఐపీఎల్‌ 2019లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ దాదాపుగా ముగిసినట్లే. సోమవారం రాత్రి ముంబై ఇండియన్స్‌ చేతిలో రాయల్ చాలెంజర్స్ 5 వికెట్ల తేడాతో ఓడిపోయి ఏడో ఓటమిని మూటకట్టుకుంది

ఐపీఎల్‌ 2019లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ దాదాపుగా ముగిసినట్లే. సోమవారం రాత్రి ముంబై ఇండియన్స్‌ చేతిలో రాయల్ చాలెంజర్స్ 5 వికెట్ల తేడాతో ఓడిపోయి ఏడో ఓటమిని మూటకట్టుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. డివిలియర్స్ 75, మొయిన్ అలీ విధ్వంసక ఆటతీరుతో రాయల్ ఛాలెంజర్స్ స్కోరు బోర్డు పరుగులు తీసింది.

అయితే చివర్లో మలింగ జూలు విదల్చడంతో బెంగళూరు మరిన్ని పరుగులు చేయలేకపోయింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ముంబైకి ఓపెనర్లు డికాక్ 40, రోహిత్ శర్మ 28 శుభారంభాన్ని అందించారు.

అయితే ఒక్క పరుగు తేడాతో ముంబై ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. అనంతరం సూర్యకుమార్ 29, ఇషాన్ కిషన్ 21 పరుగులు చేసి స్కోరు బోర్డును ఉరుకులు పెట్టించారు. చివరి ఓవర్లలో రన్ రేట్ పెరిగిపోవడంతో హార్డిక్ పాండ్యా రెచ్చిపోయాడు.

పవన్ నేగి వేసిన 19వ ఓవర్‌లో ఏకంగా రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదడంతో ఒక్క ఓవర్‌ మిగిలి వుండగానే ముంబై లక్ష్యాన్ని అధిగమించింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో ఇంకా ఆరు మ్యాచ్‌లు మిగిలి వుండగానే రాయల్ చాలెంజర్స్ నిష్క్రమించేందుకు సిద్ధమైంది.

దీంతో ఈ సీజన్‌లో అందరికంటే టోర్నీ నుంచి నిష్క్రమిస్తున్న జట్టుగా బెంగళూరు నిలవనుంది. కాగా, ఇవాళ్టీ మ్యాచ్‌ల కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో రాజస్థాన్ రాయల్స్ మొహాలీలో తలపడనుంది. 

click me!