పంజాబ్ పై చెన్నై ఘన విజయం... అతడు మా జట్టుకు దక్కిన ఆణిముత్యం: ధోని

By Arun Kumar PFirst Published Oct 5, 2020, 8:17 AM IST
Highlights

ఐపిఎల్ సీజన్ 13లోకి ఎన్నో అంచనాలతో అడుగుపెట్టిన సీఎస్కే వరుస ఓటముల తర్వాత మంచి విజయాన్ని అందుకుంది.

అబుదాబి: కింగ్స్ లెవెన్ పంజాబ్ తో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భత విజయాన్ని అందుకుంది. పది వికెట్ల తేడాతో పంజాబ్ ను చిత్తుచేసింది చెన్నై. ఇలా ఐపిఎల్ సీజన్ 13లోకి ఎన్నో అంచనాలతో అడుగుపెట్టిన సీఎస్కే వరుస ఓటముల తర్వాత మంచి విజయాన్ని అందుకుంది. ఈ  గెలుపు అనంతరం సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని మాట్లాడుతూ... విజయమంటే ధాటిగా ఆడటమే కాదన్నారు. ఓటములు ఎదురయినా మంచి శుభారంభం కోసం ఎదురుచూశామని... అది ఇప్పుడు లభించిందన్నారు. 

ఇక పంజాబ్ విసిరిన 179 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేధించడంతో అద్భుదత బాగస్వామాన్ని నెలకొల్పిన చెన్నై ఓపెనర్లపై ధోని ప్రశంసలు కురిపించారు. షేన్ వాట్సన్ ఒక్కసారి చెలరేగితే అడ్డుకోవడం అసాధ్యమని... ఇంతకాలం మంచి సమయం కోసం అతడు ఎదురుచూశాడన్నారు. తనదైన రోజు అతడు ఎలా ఆడతాడో తెలుకోడానికి ఇదే నిదర్శనమన్నారు. 

మరో ఓపెనర్ డుప్లెసిస్ అయితే చెన్నై జట్టుకు దొరికిన ఆణిముత్యం అన్నారు. అతడు మైదానంలో ఎక్కడికైనా బంతిని తరలించగలడని... విభిన్నమైన షాట్లతో బౌలర్లను అయోమయానికి గురిచేస్తాడంటూ డుప్లెసిస్ ని ప్రశంసించాడు.  మొత్తంగా వాట్సన్‌, డుప్లెసిస్‌ అద్భుతంగా ఆడుతూ, తమవైన షాట్లతో అలరించారని కెప్టెన్‌ ధోని అన్నాడు. 

read more  సూపర్ కింగ్స్ పంజా దెబ్బకు కింగ్స్ ఎలెవన్ విలవిల

ఐపిఎల్2020లో హ్యాట్రిక్ ఓటముల తర్వాత మంచి కమ్‌బ్యాక్ ఇచ్చింది చెన్నై సూపర్ కింగ్స్. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విధించిన 179 పరుగుల లక్ష్యాన్ని తేలిగ్గా ఆడుతూ పాడుతూ చేధించింది. సీజన్‌లో తొలిసారిగా షేన్ వాట్సన్ ఫామ్‌లోకి రావడం, డుప్లిసిస్‌తో కలిసి మొదటి వికెట్‌కి భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో చేధనలో చెన్నై ఎక్కడా ఇబ్బంది పడలేదు...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్లు ఎంత ప్రయత్నించినా వికెట్లు తీయలేకపోయారు. రాహుల్ ఈ మ్యాచ్‌కి ముందు చేసిన మార్పులతో జట్టులోకి వచ్చిన బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపించలేక భారీగా పరుగులు ఇచ్చారు. దీంతో ఎక్కడా ఇబ్బంది పడకుండా ఆడుతూ పాడుతూ బౌండరీలు బాదాడు డుప్లిసిస్, షేన్ వాట్సన్. వీరిద్దరూ మొదటి వికెట్‌కి జత చేసిన పరుగులే ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్‌కి అత్యధిక భాగస్వామ్యం.

షేన్ వాట్సన్ 53 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 83 పరుగులు చేయగా... డుప్లిసిస్ 53 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 87 పరుగులు చేశాడు. వరుసగా హ్యాట్రిక్ ఓటములు ఎదుర్కొన్న చెన్నై సూపర్ కింగ్స్... కింగ్స్ ఎలెవన్‌ పంజాబ్‌పై గ్రాండ్ విక్టరీ కొట్టి అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఐదు మ్యాచుల్లో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పాయింట్ల పట్టికలో కిందికి దిగజారడంతో పాటు ప్లేఆఫ్ అవకాశాలను క్లిష్టతరం చేసుకుంది. ఇక్కడి నుంచి జరిగే ప్రతీ మ్యాచ్ వారికి చాలా కీలకం కానుంది.
 

click me!